Black Garlic: వెల్లుల్లిని ఇలా తీసుకుంటే మీ శక్తి రెట్టింపు..కొలెస్ట్రాల్ నుంచి క్యాన్సర్ వరకు అన్నీ మాయం ప్రతిరోజూ వినియోగించే వెల్లుల్లిని పులియబెడితే బ్లాక్ గార్లిక్ వస్తుంది. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పులియబెట్టిన వెల్లుల్లిలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది కావున ఇది పేగులను ఆరోగ్యంగా, జీర్ణక్రియను మెరుగుపరచటం, చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది By Vijaya Nimma 02 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Black Garlic: వెల్లుల్లి పోషకాల గని అని చెబుతారు. దీన్ని ఏ రూపంలో తిన్నా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీన్ని పులియబెట్టడం ద్వారా శక్తి రెట్టింపు అవుతుందని వైద్యులు అంటున్నారు. వెల్లుల్లిని ఏ విధానంగా తినాలి.. తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడ కొన్ని విషయాలు తెలుసుకుందాం. నల్ల వెల్లుల్లి తింటే ప్రయోజనాలు: బ్లాక్ గార్లిక్ ప్రతిరోజూ వినియోగించే వెల్లుల్లిని పులియబెడితే ఇది వస్తుంది. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పులియబెట్టిన వెల్లుల్లిలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది: వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పచ్చి వెల్లుల్లితో పోలిస్తే పులియబెట్టిన వెల్లుల్లిలో బయోయాక్టివ్ సమ్మేళనాల స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. పులియబెట్టిన వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. అంతేకాకుండా ఆక్సీకరణ ఒత్తిడి, వాపును సమర్థవంతంగా తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: పులియబెట్టిన వెల్లుల్లి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా వెల్లుల్లిలో సహజ యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కొన్ని బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌ల నుంచి మనల్ని రక్షిస్తాయి. వాపును తగ్గిస్తాయి: వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ వంటి మూలకాలు శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా కొన్ని అధ్యయనాలు వెల్లుల్లి వినియోగం కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయని చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: మీ బరువు పదిరోజుల్లో తగ్గాలంటే ఈ విషయాలను వదులుకోండి చాలు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #best-health-tips #black-garlic మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి