Banana Flower: ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులను తగ్గించడంలో అరటిపువ్వు అద్భుతంగా పనిచేస్తుంది. ప్రపంచంలో ఎన్నో భయంకరమైన రోగాలు ఉన్నాయి. అంతేకాకుండా కాలక్రమేణా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, బోలు ఎముకల వ్యాధి, ఊబకాయం కారణంగా ప్రతిరోజూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అధిక కొలెస్ట్రాల్, జీర్ణక్రియ సరిగా లేక అనేక వ్యాధులు వస్తున్నాయి. అరటి పువ్వు తినడం వల్ల వీటి బారి నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
- గుండెపోటుకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్ పెరగడం. ఇవి సిరలలో ఉండి రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి అరటిపువ్వు బాగా ఉపయోగపడుతుంది. ఒక పరిశోధన ప్రకారం ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టెరాల్‌ని కలిగి ఉంటుందని చెబుతున్నారు.
బ్లడ్‌లో షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది:
- అరటి పువ్వు లోపలి భాగం తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగకుండా, తగ్గకుండా నిరోధిస్తుంది. దీనివల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
అరటి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు:
- అరటి పువ్వు బీపీని నియంత్రిస్తుంది, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉంటే పేగుల ఆరోగ్యం కూడా పాడవుతుంది. అరటిపువ్వు పేగులకు ఎంతో మంచి చేస్తుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. అంతేకాకుండా ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఎముకలకు మంచిది:
- అరటి పువ్వు ఎముక వ్యాధులకు కూడా ఉపయోగిస్తారు. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. దీనిలోని క్వెర్సెటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎముకల్లో కాల్షియాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు.
పురుషులకు వరం:
- పురుషులు వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ఎక్కువగా 50 ఏళ్లు పైబడినవారికి వస్తుంది. దీనివల్ల బలహీనమైన మూత్ర ప్రవాహం, మూత్రం లీక్ కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పువ్వులో ప్రోస్టేట్ పరిమాణాన్ని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు.
అరటి పువ్వులో పోషకాలు:
- అరటిపువ్వులో పిండి పదార్థాలు,కేలరీలు, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్, రాగి అధిక మొత్తంలో ఉంటాయి.
ఇది కూడా చదవండి: హార్ట్ బ్లాకేజ్ సంకేతాలు ఇవే.. ముందే గుర్తించకపోతే లైఫ్ డేంజర్‌లో పడినట్టే!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.