Alubukhara Health: ఈ పండ్లను తింటే రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు! మనకు ప్రకృతిలో కాలానుగుణంగా లభించే పండ్లల్లో ఆల్ బుకరా పండ్లు ఒకటి. దీనినే ఇండియన్ ప్లమ్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లను తింటే ఎముకలు ధృడంగా మారుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 29 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Alubukhara Fruit Health: ఈ పండ్లను తింటే రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు వర్షాకాలంలో ఈ పండును ఖచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు. వర్షాకాలంలో ఈ ఆల్ బుకరా పండ్లను ఎందుకు తినాలో..దీని వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఆల్ బుకరా పండ్లల్లో ఉన్నాయి. 100గ్రాముల ఆల్ బుకరా పండ్లల్లో 87 గ్రాముల నీటిశాతం, 44 క్యాలరీల శక్తి ,11 గ్రాముల కార్బోహైడ్రేట్స్, ఒకటిన్నర గ్రాముల పీచు పదార్థాలు ఉన్నాయి. ఈ పండ్లల్లో తక్కువ శక్తి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ పండ్లను తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెగిరి దగ్గు, జ్వరం, జలుబు వంటి వ్యాధుల రావు. చాలా మందికి వర్షాకాలంలో జబ్బుల చేస్తుంది. ఈ పండ్లను తింటే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అంటువ్యాధులు, జబ్బులు రాకుండా ఉంటాయి. ఇది కూడా చదవండి: బార్లీ గింజలు చేసే మేలు తెలిస్తే షాక్ అవుతారు..! అంతేకాదు.. జ్వరంతో ఉన్నప్పుడు ఈ ఆల్ బుకరా పండ్లను తింటే నోటికి రుచితోపాటు జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే ఈ పండ్లను తింటే ఎముకలు ధృడంగా, ఎముకలకు సంబంధించిన సమస్యలు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రతీ రోజూ రెండు పూటలా ఈ పండ్లను 4 నుంచి 5 చొప్పున తింటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: పెరుగుతో జుట్టు పెరుగుతుందా.. నిపుణులు ఏమంటున్నారు? ఆల్ బుకరా (Alubukhara )పండ్లను తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచడంతోపాటు గుండె ఆరోగ్యం, జీర్ణశక్తి, మలబద్దకం, జీర్ణకోశం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ పండ్లల్లో ఈ నీటిశాతం ఎక్కువగా.. శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ పండు తింటే వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఈ పండ్లు బరువు తగ్గడంలో కూడా మనకు ఎంతగానో మేలు చేస్తుంది. ఈ విధంగా వర్షాకాలంలో ఆల్ బుకరా పండ్లు తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. #health-benefits #alubukhara-fruit మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి