Yogurt Grow Hair: పెరుగుతో జుట్టు పెరుగుతుందా.. నిపుణులు ఏమంటున్నారు?

శీతాకాలంలో చర్మం పొడిబారడం, వాతావరణ కాలుష్యంతో చుండ్రు సమస్య ఉంటుంది. చుండ్రు వల్ల దురద, జుట్టు రాలిపోతుంది. ఓ గిన్నెలో పెరుగు, నిమ్మరసం, ఆవనూనె కలిపి ఆ పేస్ట్‌ను జుట్టుకు రాసుకోని కుంకుడు రసంతో స్నానం చేయాలి. ఇలా వారంలో ఒకసారి చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.

New Update
Yogurt Grow Hair: పెరుగుతో జుట్టు పెరుగుతుందా.. నిపుణులు ఏమంటున్నారు?

Yogurt Grow Hair: శీతాకాలంలో ఎక్కువగా చుండ్రు సమస్య తలెత్తుతుంది. చర్మం పొడిబారడం, వాతావరణ కాలుష్యంతో చుండ్రు ఎక్కువగా మనల్ని బాధపెడుతూ ఉంటుంది. చుండ్రు వల్ల దురద, జుట్టు రాలిపోవడంతో పాటు చికాకుగా ఉంటుంది. ఎన్నో రకాల షాంపులు, నూనెలు వాడినా ప్రయోజనం మాత్రం ఉండదు. చిన్న చిన్న చిట్కాలతో చుండ్రును నివారించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
ఇన్‌ఫెక్షన్‌, దురద తగ్గుతాయి
ఈ చిట్కాలను వాడటం వల్ల చుండ్రు తగ్గడమే కాదు..ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. గిన్నెలో 4 చెంచాల పెరుగు, అరచెక్క నిమ్మరసం, ఒక చెంచా ఆవనూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్‌ను జుట్టు కుదుళ్ల నుంచి పైవరకు బాగా పట్టించిన తర్వాత గంట సమయం వరకు అలాగే వదిలేయాలి. తర్వాత కుంకుడు రసంతో స్నానం చేయాలి. ఇలా వారంలో ఒకసారి చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. అంతేకాకుండా తలలోని చర్మం కూడా పొడిబారకుండా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఈ మిశ్రమాన్ని రాయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌, దురద కూడా బాగా తగ్గిపోతాయి.
ఇది కూడా చదవండి: ఈ పండు తినడం మర్చిపోవద్దంటున్న వైద్యులు
ఒక గిన్నెలో 3 చెంచాల పెరుగు లేదా 6 చెంచాల ఉల్లి రసం తీసుకుని బాగా కలపాలి. దాన్ని జుట్టుకు పట్టించి గంట వదిలేయాలి. ఆ తర్వాత రసాయనాలు లేని షాంపూతో తలంటుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాకుండా మన శిరోజాలు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి. చుండ్రు సమస్య తగ్గిపోవడమే కాకుండా జుట్టు రాలడం కూడా ఆగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా వారానికి రెండుమూడుసార్లు తలస్నానం చేస్తే తలలోని మట్టిపోతుందని, కుదుళ్లు శుభ్రంగా ఉంటాయని, ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ఉంటాయని చెబుతున్నారు. మార్కెట్‌లో ఎక్కువగా దొరికే రసాయన షాంపూల కంటే ఆయుర్వేద షాంపూలు, కుంకుడు కాయలు, సీకాయ వంటి వాటితో తలస్నానం చేయాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: చలికాలంలో ఈ పండు తింటే ఎంతో ఆరోగ్యం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు