మంచి ఆరోగ్యం కోసం శరీరంలో రక్తం స్వేచ్ఛగా ఉండాలి. అంతేకాకుండా శరీరంలో రక్తం కొరత ఉండకూడదు.. రక్తం అపరిశుభ్రంగా ఉంటే శరీరంలోని అవయవాలకు చాలా దెబ్బ అంటున్నారు డాక్టర్లు చెబుతున్నారు. మనం తినే ఆహారం, త్రాగే నీరు ఆరోగ్యంపై మంచి చెడు ప్రభావాలు కలిగి ఉంటాయి. ఆహారం పానీయాలలు, రసాయనాలు నరాలకు హాని కలిగిస్తాయి కాబట్టి సహజంగా రక్తాన్ని శుద్ధి చేయడం ఎలాగో చూద్దాం. మన శరీరంలో ఉవడే రక్తం ఎన్నో రకాల పనులు చేస్తుంది. హార్మోన్లను, ఆక్సిజన్, చక్కెరలు, కొవ్వులను కణాలకు రవాణా చేయడంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. రోజూ మనం తిసుకునే ఆహారంతో పాటు ప్రకృతిలోని కాలుష్యం, పని ఒత్తిడితో శరీరంలో విష పదార్థాలు అధికంగా పేరుకుపోతాయి.
చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తోంది
కాగా.. రక్తం ఈ వ్యర్థాలను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచి.. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తోంది. కిడ్నీలు, ఊపిరితిత్తులు, లివర్ రక్తాన్ని శుద్ధి చేసేందుకు తరుచూ పని చేస్తుంది. కొన్ని రకాల ఆహారాలను ప్రతీ రోజూ తినటం వల్ల ఈ ప్రక్రియ మరింత వేగంగా మారుతుంది. అంతేకాకుండా మన బాడీలోని వ్యర్థాలను కూడా సులభంగా బయటికి వెళ్తాయి. జామ, యాపిల్ పండ్లతో పాటు టమాటాలను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తం శుద్ది మరింత ఎక్కువ అవుతుంది. శరీరంలో ఉండే భార లోహాలు, వ్యర్థాలు, హానికర రసాయనాలు బయటకు పోతాయి. టమాటాల్లో ఉండే లైకోపీన్ గ్లుటథియోన్ రసాయనాలు, వ్యర్థాలను బయటకు త్వరగా పంపిస్తుంది. ఆకు కూరల్లో అనేక పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటం వలన అనారోగ్యాలను దూరంగా చేస్తుంది.
శరీరంలోని రక్తం ఆరోగ్యంగా..
క్యాబేజీ, పాలకూరను రోజూ భోజనంలో తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో వల్ల రక్త సరఫరా మెరుగుపడి శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, సహజసిద్ధమైన నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గించి..లివర్ దెబ్బ తినకుండా చూస్తాయి. ప్రతిరోజు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరం సహజసిద్దంగా శుభ్రమైయి.. రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. బెల్లంలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను బాగుచేసి మలబద్ధకం రానీయదు.. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపుతుంది. బెల్లంలో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను ఎక్కువగా పెంచుతుంది. దీని వలన శరీరంలోని రక్తం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు తగినంత నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటకుపోయి.. అవయవాలు మంచిగా పనిచేస్తాయి. దీంతో రక్తం కూడా శుద్ధి అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: కరీంనగర్ చరిత్ర తిరగ రాస్తా.. భారీ మెజార్టీతో గెలుస్తా: బండి సంజయ్ నామినేషన్