Winter Season: చలికాలంలో వీటిని తినడం వల్ల రోగాలకు బై బై!

శీతాకాలంలో వచ్చే అనేక వ్యాధులకు ఈ కూరగాయలు ద్వారా చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. వాటిలో ముఖ్యంగా వెల్లుల్లి, పాలకూర, బ్రోకలీ ప్రధానమైనవి. ఇవి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరాన్ని ఇన్‌ ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.

Winter Season: చలికాలంలో వీటిని తినడం వల్ల రోగాలకు బై బై!
New Update

చలికాలం (Winter Season)  మొదలవ్వడంతోనే తన వెంట అనేక రకాల సీజనల్ వ్యాధులను తీసుకుని వస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఏదోక సందర్భంలో జలుబు, దగ్గు, జ్వరం పడుతుంటాము. ఈ కాలంలో సూర్యుని కాంతి చాలా తక్కువగా రావడం వల్ల వైరస్ లు పెరిగేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.

అందుకే ఈ సీజన్‌ లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పెద్ద సవాలుతో కూడిన విషయామనే చెప్పవచ్చు. అందుకే ఈ కాలంలో ఎక్కువగా వేడి పదార్థాలను తినడానికే ప్రయత్నించాలి. దీని వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యంగానూ ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా శరీరలో ఎలాంటి వ్యాధులు దగ్గరకు రాకుండా ఉంటాయి. ఈ కాలంలో దొరికే కొన్ని కాయగూరల్లో విటమిన్లు, మినరల్స్‌ , యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తుంటాయి. అవి రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శరీరం సీజనల్ వ్యాధులతో చురుకుగా పోరాడుతుంది.

పాలకూర..(Spinach)

ఇందులో విటమిన్‌ ఇ, మెగ్నీషియం పుష్కలంగా దొరుకుతాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తుంది. దాంతో వైరస్‌ లు, బ్యాక్టీరియాలు అంతగా అభివృద్ధి చెందవు. అంతేకకాకుండా ఇతర ప్రమాదాల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తుంది. పాలకూర చాలా ప్రయోజన కరమైన ఆకు కూరగా చెప్పుకొవచ్చు. ఇందులో ఐరన్‌ కూడా ఎక్కువగా ఉండడంతో ఇది రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది.

బ్రోకలీ (Brocali)

ఇంతకు ముందు అంటే బ్రోకలీ గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ..ప్రస్తుత రోజుల్లో అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. దీనిలో ఉండే విటమిన్‌ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీని వినియోగం వల్ల వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలు, శుక్లాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇందులో లభించే విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంపొదింస్తుంది. గాయాల్ని నయం చేస్తుంది. ఇందుఓ విటమిన్లు ఏ, సీ, ఈ ..తో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.

వెల్లుల్లి (Garlic)

వెల్లులిని క్రిమినాశక, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ ఏజెంట్‌ గా ఉపయోగించడం జరుగుతుంది. ఇది శరీరంలోని వైరస్‌ లు, ఇతర సూక్ష్మ జీవుల నుంచి శరీరాన్ని రక్షించడానికి పని చేస్తుంది. దీనిని ఈ కాలంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ కనిపిస్తుంది. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడుతూ శరీరాన్ని బలపరుస్తుంది.

Also read: శీతాకాలంలో వచ్చే సమస్యలకు ఈ ఆకుల టీతో చెక్‌ పెట్టొచ్చు తెలుసా!

#garlic #winter #vegtables #spinch #brakoli
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe