Special Trains: సికింద్రాబాద్‌- విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు!

విశాఖ నుంచి సికింద్రాబాద్ , తిరుపతి, బెంగళూరులకు వెళ్లే వారాంతపు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లను డిసెంబర్‌ 4 నుంచి నడపనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.

Railway : వేసవి సెలవులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రైల్వేశాఖ
New Update

విశాఖ నుంచి సికింద్రాబాద్ , తిరుపతి, బెంగళూరులకు వెళ్లే వారాంతపు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే నిర్ణయించింది. నవంబర్‌ 22న రైల్వే విడుదల చేసిన వివరాల ప్రకారం విశాఖ - సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్‌ రైలు వచ్చే నెల డిసెంబర్‌ 6 నుంచి జనవరి 31 2024 వరకు బుధవారాల్లో 7 గంటలకు వైజాగ్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు 9 గంటకు సికింద్రాబద్‌ చేరుకుంటుంది.

ఈ క్రమంలో ఈ ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు , భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, వైజాగ్‌, సికింద్రాబాద్‌. ఇదిలా ఉంటే..వైజాగ్‌- తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు డిసెంబర్‌ 4 నుంచి జనవరి 9 వరకు సోమవారాల్లో 7 గంటలకు వైజాగ్‌ నుంచి బయల్దేరి తరువాత రోజు 9 గంటల 15 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో  రైలు తిరుపతి- వైజాగ్‌ వీక్లీ స్పెషల్ డిసెంబర్‌ 5 నుంచి జనవరి 30 వరకు ప్రతి మంగళవారం తిరుపతి నుంచి 9.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 10.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ క్రమంలో రైలు వైజాగ్ తిరుపతి మధ్య దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో రైలు ఆగుతుంది.

విశాఖ - బెంగళూరు ప్రత్యేక రైలు డిసెంబర్‌ 3 నుంచి జనవరి 28 వరకు ఆదివారం 3.55 గంటలకు వైజాగ్ నుంచి బయల్దేరి మరుసటి రోజు 12.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు- విశాఖ ప్రత్యేక రైలు డిసెంబర్‌ 4 నుంచి జనవరి 29 వరకు సోమవారాల్లో బెంగళూరు నుంచి 3.50 కి బయల్దేరి మరుసటి రోజు 1.30 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైలు ఆగే ప్రదేశాలు..సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌ పేట, కుప్పం, బంగారుపేట, బెంగళూరు - విశాఖపట్నం మధ్య విశాఖపట్నం, కృష్ణరాజనంపురం స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు వివరించారు.

Also read: నిన్న వైజాగ్ ఆటో యాక్సిడెంట్ తో కదిలిన రవాణా శాఖ.. అలాంటి ఆటోలు సీజ్!

#tirupati #vizag #bengaluru #special-trains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి