Ease My Trip: మాల్దీవులు - భారత్‌ వివాదం నేపథ్యంలో ''ఈజ్‌ మై ట్రిప్‌'' కీలక ప్రకటన!

ఇండియన్‌ ట్రావెల్‌ కంపెనీ అయినటువంటి ''ఈస్‌ మై ట్రిప్‌ '' ఓ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ''నేషన్‌ ఫస్ట్‌..బిజినేస్‌ లేటర్‌'' అనే పేరిట ఓ కీలక ప్రకటన చేసింది.జనవరి 8 నుంచే మాల్దీవులకు అన్ని ప్రయాణ బుకింగ్‌ లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది.

Ease My Trip: మాల్దీవులు - భారత్‌ వివాదం నేపథ్యంలో ''ఈజ్‌ మై ట్రిప్‌'' కీలక ప్రకటన!
New Update

Ease My Trip: ప్రధాని నరేంద్ర మోడీ (Modi) లక్షద్వీప్‌ (Lakshdweep) పర్యటన చేసిన నేపథ్యంలో మాల్దీవుల (Maldives) మంత్రులు ముగ్గురు నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారతీయులు మాల్దీవుల ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో పాటు చాలా మంది పర్యాటకులు వారి మాల్దీవుల ట్రిప్‌ ని కూడా క్యాన్సిల్‌ చేసుకొని మాల్దీవుల ఆర్థిక రంగానికి గండి కొట్టారు.

ఈ క్రమంలో చాలా మంది భారతీయులు (Indians) ఇక నుంచి మాల్దీవులకు వెళ్లకూడదని నిర్ణయించుకోవడంతో పాటు లక్షద్వీప్‌ లకు వెళ్లేందుకు పయనమయ్యారు. దీంతో చాలా మంది సెలబ్రిటీలు కూడా గొంతెత్తి మాల్దీవుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా చతికిలపడ్డ ఆర్థిక రంగాన్ని మెరుగుపరుచుకోవడం కోసం చైనా నుంచి పర్యాటకులను పంపాల్సిందిగా వేడుకుంటుంది.

ఈ క్రమంలోనే ఇండియన్‌ ట్రావెల్‌ కంపెనీ అయినటువంటి ''ఈస్‌ మై ట్రిప్‌ '' ఓ కీలక ప్రకటన చేసింది. ముందు దేశ గౌరవమే మాకు ముఖ్యమని తరువాతే వ్యాపారం గురించి ఆలోచిస్తామని తెలిపింది. ఈ మేరకు ''నేషన్‌ ఫస్ట్‌..బిజినేస్‌ లేటర్‌'' అనే పేరిట ఓ కీలక ప్రకటన చేసింది.

ఎన్నో అద్భుతమైన బీచ్‌ లు..

భారత్‌ లో ఎన్నో అద్భుతమైన బీచ్‌ లు ఉన్నందుకు మేము గర్వపడుతున్నట్లు సంస్థ పేర్కొంది. దేశంలోని లక్షద్వీప్‌, అండమాన్‌, గోవా, కేరళతో పాటు ఇతర రాష్ట్రల్లో కూడా ఎన్నో అందమైన బీచ్‌ లు ఉన్నాయని , భారత్‌ లో 7500 కిలో మీటర్ల తీరప్రాంతం ఉందని సంస్థ పేర్కొంది.

భారత ప్రధాని లక్ష్మద్వీప్‌ పర్యటన చేసిన సందర్భంలో మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. నాలుగు రోజుల ముందు అంటే జనవరి 8 నుంచే మాల్దీవులకు అన్ని ప్రయాణ బుకింగ్‌ లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది.

తమ సంస్థ ఎప్పుడు కూడా సొంత లాభాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని వివరించింది. అంతేకాకుండా అందరూ ఐక్యంగా ఉండాలంటూ ఈజ్‌ మై ట్రిప్‌ పిలుపునిచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా అందరూ ఒక్కటై తమ గొంతును వినిపిస్తున్న వారందరిని చూస్తుంటే సంతోషంగా ఉందని తెలిపింది.

Also read: హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ ఎదురు దాడులు!

#modi #bharath #maldives #ease-my-trip #lakshdweep
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe