Peru: పెరూలో భారీ భూకంపం.. విరిగిపడ్డ కొండచరియలు

పెరూ దేశంలో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాంతంలో భూమి భారీ కుదుపులకు లోనైంది. రిక్టర్‌ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భారీ భూకపం తర్వాత వెంటవెంటనే పలు చిన్నచిన్న ప్రకంపనలు రావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి.

New Update
Peru: పెరూలో భారీ భూకంపం.. విరిగిపడ్డ కొండచరియలు

పెరూలో భూమి దద్ధరిల్లింది. దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాంతంలో భూమి భారీ కుదుపులకు లోనైంది. రిక్టర్‌ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భారీ భూకపం తర్వాత వెంటవెంటనే పలు చిన్నచిన్న ప్రకంపనలు రావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపంవల్ల ఎంత నష్టం జరిగింది అనే దానిని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Also Read: T20 World Cup: టీ20 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు? మ్యాచ్ రద్దయితే విజేతను తేల్చేదెలా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు