Duvvada Srinivas: దువ్వాడ, మాధురి సంచలన ఆడియో లీక్ .. తాను చనిపోతున్నానంటూ!

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయింది. లక్ష్మీపురం టోల్‌గేట్ వద్ద మాధురి కారు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని మాధురికి చెప్పినట్లు బటయపడింది. తన భార్య వాణి వల్లే మనస్థాపానికి గురైనట్లు మీడియాతో చెప్పమన్నారు శ్రీనివాస్.

New Update
Duvvada Srinivas: దువ్వాడ, మాధురి సంచలన ఆడియో లీక్ .. తాను చనిపోతున్నానంటూ!

Duvvada Srinivas- Madhuri: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయింది. శ్రీకాకుళం జిల్లాలోని లక్ష్మీపురం టోల్‌గేట్ వద్ద మాధురి కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మాధురితో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడిన రహస్యాలు బట్టబయలయ్యాయి.


వాణి వల్లే మనస్థాపానికి గురై..
రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించాలని మాధురితో చెప్పారు దువ్వాడ. దువ్వాడ వాణి వల్లే మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు చిత్రీకరించాలన్నారు. ఇదే విషయాన్ని మీడియాతో చెప్పాలని, తాను చనిపోతున్నట్లు నమ్మించాలని తెలిపారు. అయితే రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకున్నప్పటికీ సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. అయితే ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది.

Also Read: కరోనా వల్ల బ్రెయిన్‌ సమస్యలు.. సర్వేలో బయటపడ్డ సంచలన నిజాలు

Advertisment
తాజా కథనాలు