నా రాజాతో మొదటి దీపావళి | Divvela Madhuri - Duvvada Srinivas Diwali Celebrations| RTV
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్లీ రచ్చ మొదలైంది. దువ్వాడ ఇంట్లోకి దివ్వెల మాధురి రీ-ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇంట్లోకి దువ్వాడ వాణి వెళ్లొచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులతో కలిసి దువ్వాడ ఇంటికొచ్చిన వాణి ఇంట్లోకి రానివ్వాలంటూ ఆందోళన చేపట్టింది.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయింది. లక్ష్మీపురం టోల్గేట్ వద్ద మాధురి కారు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని మాధురికి చెప్పినట్లు బటయపడింది. తన భార్య వాణి వల్లే మనస్థాపానికి గురైనట్లు మీడియాతో చెప్పమన్నారు శ్రీనివాస్.
దువ్వాడ శ్రీనివాస్‌కు తనతో ప్రాణహాని ఉందంటూ వాణి చేసిన వ్యాఖ్యలను దివ్వల మాధురి ఖండించింది. వాణితోనే శ్రీనివాస్ ప్రాణానికి ప్రమాదం ఉందంటూ వీడియో రిలీజ్ చేసింది. రెండేళ్లనుంచి ఆయన ఆలనా పాలనా చూస్తున్న తాను ఎందుకు హాని తలపెడతానని ప్రశ్నించింది.
దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. టెక్కలిలో దువ్వాడ ఇల్లు నిర్మించిన స్థలం తనదేనని చింతాడ పార్వతీశ్వరరావు అనే వ్యక్తి చెబుతున్నారు. ఈ విషయంలో తనకు రూ.60 లక్షలు రావాల్సి ఉందన్నారు. ఈ డబ్బులు ఇవ్వకుండా పంపకాలపై చర్చలు ఏంటని ఫైర్ అయ్యారు.
దువ్వాడ శ్రీనివాస్-వాణి-మాధురి వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీవీకి దివ్వల మాధురి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్, వాణి, ఆమె భర్త గురించి సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. ఇంటర్వ్యూ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్-వాణి-మాధురి వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భార్య మాధురికి భర్త మహేష్ చంద్రబోస్ మద్దతుగా నిలిచారు. రాజకీయాల్లో ఎదుగుతుందనే మాధురిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మాధురిపై ఎవరు ఎన్ని చెప్పినా తాను పట్టించుకోనని, మాధురిని వదలనన్నారు.
దివ్వల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టెక్కలి నుంచి పలాస మార్గంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి తనపై చేసిన ఆరోపణలను భరించలేకే ఇలా చేసినట్లు మాధురి చెబుతున్నారు.