Menopause: మెనోపాజ్‌ వల్ల బరువు పెరుగుతారా..అసలు నిజం ఏంటి?

స్త్రీకి ఆఖరి పీరియడ్స్ తర్వాత 12 నెలల వరకు పీరియడ్స్ రాకపోతే మెనోపాజ్ వచ్చినట్లు పరిగణిస్తారు. బరువు పెరగడం అనేది మెనోపాజ్‌కి సంబంధించినది కాదని వైద్యులు అంటున్నారు. మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ జీవక్రియ మందగిస్తుంది. దీనికి మెనోపాజ్‌తో సంబంధం లేదని చెబుతున్నారు.

New Update
Menopause: మెనోపాజ్‌ వల్ల బరువు పెరుగుతారా..అసలు నిజం ఏంటి?

Menopause: రుతుక్రమంలాగా, మెనోపాజ్ కూడా ప్రతి స్త్రీ జీవితంలో ఒక భాగం. ప్రతి స్త్రీ వయస్సు ప్రకారం దీనిని ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ పీరియడ్స్ మాదిరిగానే మెనోపాజ్ విషయంలో చాలా అపోహలు ఉంటాయి. స్త్రీ జీవితంలో ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఆమె రుతుక్రమం ఆగిపోతుంది. స్త్రీకి ఆఖరి పీరియడ్స్ తర్వాత 12 నెలల వరకు పీరియడ్స్ రాకపోతే మెనోపాజ్ వచ్చినట్లు పరిగణిస్తారు. మెనోపాజ్ అంటే రుతుక్రమం పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. రుతువిరతి అనేది స్త్రీలో గుడ్డు ఉత్పత్తిని పూర్తిగా ఆపివేస్తుంది. అంతేకాకుండా స్త్రీ తల్లిగా మారదు. ఇది ప్రధానంగా 45 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో కనిపిస్తుంది.

1. మెనోపాజ్ అందరికీ ఒకేలా ఉంటుందా?

  • ఇది అస్సలు నిజం కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతి స్త్రీ సామాజిక-సాంస్కృతిక, జీవనశైలిలో అనేక మార్పులు ఉంటాయి. హార్మోన్లలో అనేక మార్పుల కారణంగా ప్రతి స్త్రీకి రుతువిరతి అనేది భిన్నంగా ఉంటుంది.

2. మెనోపాజ్ 50 ఏళ్ల తర్వాతే వస్తుందా?

  • ఇందులో కూడా వాస్తవం లేదని అంటున్నారు. ఇది కూడా మహిళల జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. మోనోపాజ్‌ సాధారణ వయస్సు 45 నుంచి 55 సంవత్సరాలు. అయితే ఇది మహిళలకు వేర్వేరు వయస్సుల్లో రావొచ్చు. కొందరికి త్వరగా మెనోపాజ్ వస్తే మరికొందరికి ఆలస్యం కూడా అవుతుంది.

3. మెనోపాజ్ తర్వాత బరువు పెరుగుతారా?

  • బరువు పెరగడం అనేది మెనోపాజ్‌కి సంబంధించినది కాదని వైద్యులు అంటున్నారు. మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ జీవక్రియ మందగిస్తుంది. కాబట్టి చాలా మంది మహిళలు బరువు పెరుగుతుంటారు. దీనికి మెనోపాజ్‌తో సంబంధం లేదని చెబుతున్నారు.

4. మెనోపాజ్ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందా?

  • మెనోపాజ్ మీ లైంగిక జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేయదు. అయితే వయసు పెరిగే కొద్దీ మన బలం తగ్గి యోని పొడిబారుతుంది. ఇది లైంగిక కోరికను తగ్గిస్తుంది.

5. మెనోపాజ్ తర్వాత హాట్ ఫ్లాషెస్:

  • హాట్ ఫ్లాష్ అంటే అకస్మాత్తుగా మంట లేదా వేడి అనుభూతి. ఇది సాధారణమైన విషయమే, ఇది ప్రతి స్త్రీకి వర్తించదు. మెనోపాజ్ ప్రారంభమైన రెండేళ్లలోపు హాట్ ఫ్లాషెస్ వస్తుందని, అయితే 60 శాతం మంది మహిళల్లో కొంత సమయం తర్వాత అవి ఆగిపోతాయని చెబుతున్నారు.

6. మెనోపాజ్ తర్వాత డిప్రెషన్:

  • మెనోపాజ్‌ తర్వాత కాస్త డిప్రెషన్‌కు గురవుతారు. నిద్రలేమి, వేడి ఆవిర్లు చాలా మంది స్త్రీలకు చికాకు కలిగిస్తాయి.

ఇది కూడా చదవండి: ఈ ఆహారాలు ఆల్కహాల్ కంటే ప్రమాదం.. దూరంగా ఉండండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు