IT Minister Sridhar Babu: లాయర్‌ టు ఐటీ మినిస్టర్‌.. క్రికెట్‌ ప్లేయర్.. శ్రీధర్‌బాబు ఆల్‌రౌండర్‌ బాసూ!

దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించిన శ్రీధర్‌బాబు లాయర్‌గా, ఐదు సార్లు ఎమ్మెల్యేగా, విద్యార్థి దశలో క్రికెటర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

IT Minister Sridhar Babu: లాయర్‌ టు ఐటీ మినిస్టర్‌.. క్రికెట్‌ ప్లేయర్.. శ్రీధర్‌బాబు ఆల్‌రౌండర్‌ బాసూ!
New Update

IT Minister Sridhar Babu: ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్‌ తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత ప్రజల్లో ఎక్కువగా చర్చ జరిగిన టాపిక్స్‌లో నెక్ట్స్‌ ఐటీ మినిస్టర్‌ ఎవరన్నది ఒకటి. ప్రముఖంగా చాలా మంది పేర్లు వినిపించినా మొదటి నుంచి అంతా దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకే ఈ శాఖ కేటాయిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌ స్థానాన్ని ఆయన రీప్లేస్‌ చేస్తేనే బాగుంటదన్న కామెంట్స్‌ ఐటీ ఉద్యోగుల నుంచి కూడా వినిపించింది. చివరికి అందరూ ఊహించిందే జరిగింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌.

హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే:
దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వేళ.. రేవంత్ కేబినెట్ లో మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు. మంథని..రాష్ట్రంలోనే అత్యున్నత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో ఒకటి. ఎందుకంటే మహామహులు ఇక్కడ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. మంథని రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన పీవీ నరసింహరావును మంథనిలో నాలుగు సార్లు గెలిచి చరిత్ర సృష్టించగా... ఆ తర్వాత అదే స్థాయిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజయకేతనం ఎగరవేశారు. 1999 నుంచి 2009 వరకు వరుసగా మూడుసార్లు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ గెలవగా, 2018 ఎన్నికల్లో శ్రీధర్‌బాబు గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి శ్రీదర్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.

లాయర్‌ టు ఐటీ మినిస్టర్‌:
ప్రముఖ కాంగ్రెస్ నేత శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు, జయమ్మలకు 1969 మార్చి 30న జన్మించారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. అయితే తండ్రి శ్రీపాద రావు మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు శ్రీధర్ బాబు. రాజకీయ వారసునిగా పాలిటిక్స్ లోకి అడుగుపెట్టి 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టారు.

రికార్డులు సృష్టించిన ఎమ్మెల్యే:
ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఇప్పటికే పాతతరం పాలిటిక్స్‌ను ఫాలో అవుతూ.. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు రికార్డును బ్రేక్ చేశారు. ఇప్పటి వరకు ఉమ్మ కరీంనగర్ జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత ఎవరూ లేరు. మంథని నియోజకవర్గం నుంచి పీవీ నరసింహారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపొంది శ్రీధర్ బాబు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా చరిత్ర సృష్టించారు.

క్రికెట్‌ ప్లేయర్‌ కూడా:
1999, 2004, 2009, 2018, 2023లో శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం.. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా పేరున్న నేతగా ఆయనను పరిశీలనలోకి తీసుకోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టింది అధిష్టానం. ఇక శ్రీధర్‌బాబు గురించి మరో ఆసక్తికర విషయం ఉంది. విద్యార్థిగా ఆయనో మంచి క్రికెటర్. శ్రీధర్‌బాబు నిజాం కళాశాల, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించారు. శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ కేడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి శైలాజా రామయ్యర్‌తో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఇలా దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి. ఏ పదవిలో ఉన్నా తన పొజిషన్‌కు న్యాయం చేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీధర్‌బాబు ఐటీ శాఖ మంత్రిగా తన మార్క్‌ చూపించాలని ప్రజలు బెస్ట్ విషెస్‌ చెబుతున్నారు.

Also Read: కోడళ్లు…మీ అత్తగారిని బుట్టలో వేసుకోవాలంటే ఈ బెస్ట్ ఐడియాస్ ఫాలో అవ్వండి..!!

#ktr #congress #telangana-cabinet #sridhar-babu #it-minister-sridhar-babu #it-minister
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe