Andhra Pradesh : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాల కోసం చూస్తున్న వారి ఎదురు చూపులు ఫలించాయి. ఫైనల్‌గా డీఎస్సీ నోటిపికేషన్‌ను విడుదల చేసింది వైసీపీ గవర్నమెంట్. అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. మార్చి 15 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

AP DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్
New Update

AP DSC Notification 2024 : ఆంధ్రా(Andhra Pradesh) లో డీఎస్సీ నోటిపికేషన్‌(DSC Notification) ను విడుదల చేశారు. మొత్తం 6,100 పోస్టులకు ప్రభుత్వం నోటిపికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. మార్చి 15 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న పలితాలను ప్రకటించనున్నారు. 2018 ప్రకారమే పరీక్షల సిలబస్ ఉంటుందని మంత్రి బొత్స(Minister Botsa) తెలిపారు. జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు వయో పరిమితి 44 ఏళ్ళు... ఎస్సీ, ఎస్టీ, బీసీ(SC, ST, BC) లకు అదనంగా మరో ఐదేళ్ళ సడలింపును ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటూ 1264 టీజీ పోస్టులు,  215 పీజీటీ పోస్టులకు కూడా నోటిపికేషన్ విడుదల చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలోపునే అన్ని నియామకాలను పూర్తి చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. అంతేకాకుండా ప్రతీ విద్యా సంవత్సరంలో ఖాళీలను కచ్చితంగా ఫిలప్ చేస్తామని చెప్పారు.

Also Read:Telangana:నిరుద్యోగులకు గుడ్ న్యూస్…ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు

ఫిబ్రవరి 12(ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 22. పరీక్ష మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్లలో (ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు) నిర్వహిస్తారు.

గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు:
–> ఫిబ్రవరి 12 తేదీ నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ..

–> టెట్ పరీక్ష(TET Exam) ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు

–> మార్చి 5న హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్

–> మార్చి 14న టెట్ రిజల్ట్

–> మార్చి 15 నుంచి మార్చి 30 వరకు డీఎస్సీ పరీక్షలు

–> మార్చి 31న డీఎస్సీ ప్రాధమిక కీ విడుదల

–> ఏప్రిల్ 2న ఫైనల్ కీ

–> ఏప్రిల్ 7న ఫలితాల ప్రకటన

–> అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలోని ఖాళీలను భర్తీ

–> 6100 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం

–> ఫిబ్రవరి 12 తేదీ నుంచి ప్రక్రియ మొదలై ఏప్రిల్ 7 తేదీన ఫలితాలు వెల్లడి..

–> 2280 ఎస్జీటీ పోస్టులను

–> 2299 స్కూల్ అసిస్టెంట్ లు

–> 1264 టీజీటి .

–> 215 పిజిటి లు

–> 242 ప్రిన్సిపాల్ నియామకం

12 ఏళ్ళ క్రితం తొలగించిన అప్రెంటీస్‌షిప్(Apprenticeship) విధానాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్ళపాటూ గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలను పాటించకపోతే వారి అప్రెంటీస్‌షిప్‌ను పొడిగిస్తారు. అలాగే ఈసారి డీఎస్సీ, టెట్ (TET) ఎగ్జామ్స్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా(Computer Based Exam) నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ టీసీఎస్‌తో(TCS) ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం.

Also Read : నిరుద్యోగులకు గుడ్ న్యూస్…ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు

#andhra-pradesh #ap-dsc-notification-2024 #teacher-posts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe