/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-57.jpg)
Telangana: తెలంగాణ టీచర్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు కొనసాగుతుండగానే మరో టెట్, డీస్సీకి నోటిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన స్పష్టమైన వివరాలను వెల్లడించారు.
💥Telangana Job Calendar 2024-25💥
1. Group I Mains: Oct 21-27, 2024 (Notified: Feb 2024)
2. Group III Services: Nov 17-18, 2024 (Notified: Dec 2022)
3. Lab Tech/Nurse/Pharmacist: Nov 2024 (Notified: Sep 2024)
4. Group II Services: Dec 2024 (Notified: Dec 2022)
5. Engg Posts… pic.twitter.com/jC7BTi4Bt6
— Bolgam Srinivas (@BolgamReports) August 2, 2024
ఫిబ్రవరి-2025లో నోటిఫికేషన్..
ఈ మేరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ లో ఉన్న లోసుగులు క్లియర్ చేసి 11,602 వేల పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే పరీక్షలకు ముందు నిరుద్యోగుల నుంచి మెగా డీఎస్సీ డిమాండ్ వ్యక్తం కావడంతో మరో 6 వేలతో వచ్చే ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. టెట్ నోటిఫికేషన్ నవంబర్ లో విడుదల చేసి పరీక్షను జనవరిలో నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి-2025లో నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్-2025 న పరీక్షను నిర్వహించనున్నట్లు జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. దీంతో మరోసారి టీచర్ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. టెట్ క్వాలీఫై కాని వారు కూడా మరోసారి టెట్ రాసుకునే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Cloudbursts: దేశంలో ప్రకృతి వైపరిత్యాలు.. మానవ తప్పిదాలేనా? క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత!
పాఠశాలలపై మేం లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం వెలువరించిన 11,062 టీచర్ పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా మరో ఐదు వేల ఖాళీలు ఉంటాయని తేలింది. ఈ ఐదువేలతోపాటు సమీప భవిష్యత్తులో ఏర్పడే మరికొన్ని ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నిర్వహిస్తాం. నిరుద్యోగ ఉద్యోగార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్‌లు జారీచేస్తూనే ఉంటుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.