Hyderabad : హైదరాబాద్‌లో డ్రగ్స్ సీజ్.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్

హైదరాబాద్ గచ్చిబౌలీ రాడిసన్ హోటల్‌లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనితో సంబంధం ఉన్న బీజేపీ నేత కుమారుడిని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Hyderabad : హైదరాబాద్‌లో డ్రగ్స్ సీజ్.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్

Drugs Party In Radisson Hotel : గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీ(Drugs Party) మీద రైడ్ చేశారు పోలీసులు. ఇందులో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో స్నేహితులతో కలిసి బీజేపీ(BJP) నేత యోగానంద్(Yoganand) కుమారుడు వివేకానంద్(Vivekanand) డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నాడు. దీని గురించి పక్కా సమాచారంతో.. రాడిసన్‌ హోటల్‌(Radisson Hotel) పై పోలీసుల దాడి చేశారు. వివేకానంద్‌తో పాటూ మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పార్టీలో మత్తు పదార్ధాలు...

పార్టీలో మత్తు పదార్ధాలతో పాటూ కొకైన్‌ను సరఫరా చేసినట్టు తెలుస్తోంది. వీటిని కూడా బారీ ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురూ గచ్చిబౌలీ స్టేషన్‌లో ఉన్నారు.  అసలు పార్టీలో మొత్తం ఎంత మంది పాల్గొన్నారు.. డ్రగ్స్‌ను ఎవరు సప్లై చేశారు లాంటి విషయాల మీద పోలీసులు ఆరా తీసున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వివేకానంద బీజేపీ నేత కుమారుడే కాదు మాజీ సీఎం రోశయ్య అల్లుడుకూడా. ఇతను ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త.

అప్పుడు కూడా రాడిసన్నే..
గతంలో కూడా రాడిసన్ హోట్స్ మీద పోలీసులు దాడి చేశారు. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజాలోని ఫుడ్ అండ్ మింక్ పబ్‌మీద ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంది. ఆ పబ్‌ను రద్దు చేయడమే కాకుండా 56 లక్షల పన్ను కూడా విధించింది. ఇప్పుడు మళ్ళీ గచ్చిబౌలీలోని అదే రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read : Andhra Pradesh : టీడీపీ-జనసేన పొత్తుకు శనిలా పట్టిన “23”.. ప్చ్‌..! ట్రోలింగ్‌ ఆగెదెప్పుడు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు