Drugs: జోరుగా గంజాయి అమ్మకాలు
పూర్తిగా చదవండి..తెలంగాణలో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. చిన్న చిన్న మొత్తంలో గంజాయి అమ్మకాలు చేస్తున్న వారిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) పట్టుకున్నారు. నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా గంజాయి అమ్మకాలు జోరుగా చేస్తున్నారని తెలిపారు. డ్రగ్స్, గంజాయిపై యాంటీ నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టింది. చాలా మంది ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు.
గంజాయి ముఠా అరెస్ట్
గతంలో తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ (Drugs) కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా గంజాయి ముఠాలో ప్రధాన నిందితుడు మహబూబాబాద్‌కి చెందిన వంకుడొతు వీరన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. తన మామ గంజాయి వ్యాపారం చేసేవాడని.. అతని చూసి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని గంజాయి సప్లై చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. పోలీస్ ఆఫీసర్లాగా 3 వాహనాల్లో వెళ్లి గంజాయి తీసుకొస్తున్నారని తెలిపారు. ముగ్గురు డ్రైవర్లును నియమించుకొని ఈ దందా చేస్తున్నాడని వెల్లడించారు. పోలీస్ నకిలీ ఐడీ కార్డుతో తన కారుకు పోలీస్ సైరెన్ వేసుకొని వెళ్లి చెక్ పోస్టులు, టోల్ గేట్లు దాటుతుంటాడని తెలిపారు.
నకిలీ వేషంలో దందా
ఆక్టోపస్ కానిస్టేబుల్ ప్రశాంత్, రాములు ఇద్దరి నుండి పోలీస్ ఎలా ప్రవర్తస్తారో తెలుసుకుని.. గంజాయిని కిలో రూ.4 వేలుకు కొనుగోలు చేసి.. మహారాష్ట్రలో నికిలేష్ అనే వ్యక్తికి కిలోరూ. 25 వేలకు అమ్మకాలు చేశాడని పోలీసుల విచారణ తెలింది. ఈ గంజాయి దందా ద్వారా ఇనోవా, జేసీబీ, రూ.30 లక్షలు విలువైన ఇల్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మోహిని వైన్స్‌లో రూ.15 లక్షలు పెట్టుబడి, రూ. 50 లక్షలు ఓ మార్ట్‌లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. వీరన్న ముఠాలో 25 మంది సభ్యలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. 4 కార్లు, మొబైల్స్, 44 కిలోల గంజాయిను సీజ్ చేసి.. ఆ కేసులో మరో ఆరు మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రతి ఆపరేషన్‌కు ఒక్క కొత్త మొబైల్, కొత్త సిమ్ కార్డులు వాడుతున్నట్లు గుర్తించారు. NDPS యాక్ట్ ప్రకారం వీరి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
పాస్టర్‌గా అవతరమెత్తి
మరొవైపు బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్‌పై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. డేవిడ్ హుకా అనే నైజేరియన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. 8 ఏళ్ళు క్రితం బెంగళూరుకు వచ్చి.. ఇండియాకి వచ్చాక పాస్టర్‌గా అవతరమెత్తి తన పేరును మార్చుకున్నాడు.ఫేక్ వీసా, ఫేక్ ఐడీతో సిమ్ కార్డులు తీసుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు వాడి పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారని సీవీ ఆనంద్ వెల్లడించారు. అల్ ఇండియా నైజేరియన్ స్టూడెంట్ కమ్యూనిటీ అసోషియేషన్ ఏర్పాటు చేసి.. డ్రగ్స్, గంజాయి కేసులో నైజేరియన్స్ అరెస్ట్ అయితే వారికి బెయిల్ ఇప్పించడం, వారిని వారి దేశాలకు పంపించడం వంటి పనులకు ఇతను బాధ్యత తీసుకుంటున్నాడు. ఇతని కోసం బెంగళూరులో మకాం వేసి పెట్టుకున్నామని తెలిపారు. డేవిడ్ హుకా నుండి 264 MD పిల్స్‌ని సీజ్ చేసి.. రూ.4 కోట్లు ఆస్తులు జప్తు చేయబోతున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Also Read: మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్.. తరువాత దారుణంగా హత్య.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన!!
[vuukle]