Gang rape: మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్.. తరువాత దారుణంగా హత్య.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన!! చట్టాలు ఎంత కఠినంగా మారుతున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.ఒక దిశ లాంటి సంఘటనను మర్చిపోక ముందే మరో దిశలా ఆడపిల్ల బతుకు మారుతోంది. తెలంగాణలోను అత్యాచార సంఘటనలు క్రమంగా పెరుగుతూ భయాందోళనను కల్గిస్తున్నాయి. తాజాగా..పెద్దపల్లి జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. By P. Sonika Chandra 17 Aug 2023 in క్రైం New Update షేర్ చేయండి Gang rape: చట్టాలు ఎంత కఠినంగా మారుతున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లు అవుతున్నా.. గడప దాటి బయటికెళ్లిన ఆడపిల్ల నుంచి పండు ముసలి వరకు ఇంటికి తిరిగి క్షేమంగా వస్తారనే గ్యారెంటీ లేకుండా పోయింది. దీంతో ఆడపిల్లలను బడికి పంపించాలన్నా కన్నవారు జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఒక దిశ లాంటి సంఘటనను మర్చిపోక ముందే మరో దిశలా ఆడపిల్ల బతుకు మారుతోంది. తెలంగాణలోను అత్యాచార సంఘటనలు క్రమంగా పెరుగుతూ భయాందోళనను కల్గిస్తున్నాయి. తాజాగా..పెద్దపల్లి జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఇక వివరాల్లోకి వెళితే..పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులో ఈ అమానుష సంఘటన జరిగింది.మధ్యప్రదేశ్ కు చెందిన మైనర్ బాలిక పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా దుండగులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తామని నిందితులు బాలిక కుంటుంబాన్ని బెదిరించారు. అయితే ఆ కామపిశాచులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసులను వేడుకుంటున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి