ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటని అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ ఈ ఆలాయానికి లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఒక్కరోజుకే కోట్లాది రూపాయల హుండీ ఆదాయం వస్తుంది. కేవలం దేశప్రజలే కాదు.. ప్రపంచం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడికి వెళ్తుంటారు. ఈ ఆలయంలో భారీ భద్రత ఉంటుంది. మరో విషయం ఏంటంటే తిరుమల కొండపై ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా వేంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమల కొండను 'నో ఫ్లై జోన్' గా ప్రకటించారు.
ఇక్కడ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు లాంటివి ఆ కొండపై ఎగిరేందుకు అనుమతి లేదు. ఆగమశాస్త్రం ప్రకారం చూసుకుంటే వేంకటేశ్వర స్వామి ఆలయంపై ఎలాంటి వస్తువులను ఎగరవేయడానికి అనుమతి లేదు. అయితే తాజాగా తిరుమల కొండపై ఓ డ్రోన్ కెమెరా సంచరించడం కలకలం రేపింది. అస్సాంకి చెందిన కొంతమంది మోకాళ్ల పర్వతంపై డ్రోన్‌తో విజువల్స్ తీశారు. నడకమార్గం, ఘాట్ రోడ్డు అలాగే తిరుమల కొండను షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి తిరుమలలో డ్రోన్స్ ఎగరవేయడం నిషేధం. గతంలో కూడా ఓసారి శ్రీవారి ఆలయంపై కొందరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేశారు.
Also Read: పందెం కోడి వేలానికి ముందు బిగ్ ట్విస్ట్.. కోడి నాదే అంటున్న మహేష్