Car Driving Tips : రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నారా?సురక్షితంగా మీ గమ్యం చేరాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!

New Update
Diving Tips for Winter: చలికాలంలో లాంగ్ డ్రైవ్, జర్నీలు చేస్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి

మనలో చాలామంది పగలు డ్రైవింగ్ కంటే రాత్రిపూట డ్రైవింగ్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. రాత్రిపూట ఎందుకంటే సమయం కలిసివస్తుంది. రాత్రిళ్లు ప్రయాణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మీరు సొంత వాహనంలో ప్రయాణిస్తుంటే..రాత్రివేళలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే పగటిపూట డ్రైవింగ్ కు రాత్రి చేసే డ్రైవింగ్ కు మధ్య చాలా తేడా ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొవల్సి వస్తుంది. మీకే కాదు ఇతరులకు కూడా ఈ ప్రమాదం తప్పదు. చీకటిపడ్డాక రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకునేందుకు కొన్ని పాటించాల్సిన కొన్ని నిమయాలు, టిప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

వెహికల్ మంచి ఖండిషన్‎లో ఉండాలి:
మీ రాత్రిపూట డ్రైవ్ చేయబోతున్నట్లయితే, ముందుగా మీ వెహికల్ మంచి ఖండిషన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే రాత్రిళ్లు ప్రయాణం చేసేటప్పుడు ఆకస్మాత్తుగా మధ్యలో ఆగిపోయితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అంతేకాదు హెడ్‌లైట్‌లు బ్రేక్ లైట్‌లను డిమ్ చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సిగ్నల్‌లను సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మీ కారులో ఫాగ్ లైట్లు ఉన్నట్లయితే...వాటిని కూడా ఆన్‌లో ఉంచండి.

ఇదికూడా చదవండి: వరల్డ్ కప్ క్రేజ్, ఫ్యాన్స్ కోసం పిజ్జా ధరలను భారీగా తగ్గించిన డోమినోస్..!!

అలసిపోయినప్పుడు డ్రైవ్ చేయకూడదు:
మీరు రాత్రిపూట డ్రైవింగ్ చేస్తుంటే..మీ మైండ్ యాక్టివ్ గా ఉండాలి. ఒకవేళ రాత్రి డ్రైవింగ్ చేయాల్సి వస్తే..మధ్యాహ్నం నిద్రపోండి. లేదంటే నిద్ర కారణంగా మీరు డ్రైవింగ్‌పై దృష్టి పెట్టలేరు. ఇది ప్రమాదానికి దారితీయవచ్చు, కాబట్టి మీరు అస్సలు అలసిపోకుండా చూసుకోండి.

ఓవర్ స్పీడ్ మంచిది కాదు:
రాత్రిళ్లు రోడ్లపై ఎవరూ లేరు కదాని..కొంతమంది 100స్పీడ్ దాటి ప్రయాణిస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. గాల్లో తేలినట్లు పోతుంటే...మీ సరదాగా ఉంటుండొచ్చు కానీ...ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదం. అందుకే రాత్రిపూట ఎప్పుడూ ఓవర్ స్పీడ్ చేయకూడదు. అజాగ్రత్తగా ఉండకూడదు. రాత్రి సమయంలో రోడ్డు పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది, కాబట్టి నెమ్మదిగా, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.

ఇదికూడా చదవండి: ఆ దేశం వెన్నులో వణుకు…100 దాటిన మరణాలు…!!

మద్యం సేవించి నడపకూడదు:
మద్యంసేవించి ఎట్టిపరిస్థితుల్లో వాహనం నడపకూడదు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆల్కాహల్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఏమాత్రం కొంచెం ఎక్కువైనా మీలో జోష్ ఎక్కువైతుంది. ఈడ్రైవింగ్ ఎంత ప్రమాదమో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు