Spinach Juice : పాలకూర జ్యూస్‌ తాగితే అందం, ఆరోగ్యం.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

పాలకూర జ్యూస్‌ దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఈ జ్యూస్‌ తాగితే రోగనిరోధకశక్తి పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Spinach Juice : పాలకూర జ్యూస్‌ తాగితే అందం, ఆరోగ్యం.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Spinach Juice Benefits :భారతీయులు (Indians) ఇష్టపడే అహారలలో పాలకూర ఒకటి. పాలకూరల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్‌ కె, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. పాలకూర తింటే ఆరోగ్యానికి మంచిది. ఇది దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాలకూరతో చేసిన వంటలతోపాటు జ్యూస్‌ తాగిన మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) పొందవచ్చట. ప్రతిరోజూ పాలకూర జ్యూస్‌ (Spinach Juice) తాగితే కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పారకూర జ్యూస్‌ తాగటం వల్లన ఇంక ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

publive-image

పాలకూర జ్యూస్‌ వల్ల కలిగే లాభాలు:

  • పాలకూర జ్యూస్‌లో విటమిన్ ఏ, గ్లాకోమా కంటికి, కంటి చూపుకు మేలు చేస్తుంది. దృష్టి లోపాలు, రక్త హీనత ఉంటే రోజూ ఈ జ్యూస్‌ తాగితే సమస్యను తగ్గించుకోవచ్చు.
  • పాలకూర జ్యూస్‌ గుండె ఆరోగ్యంగా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని తాగితే రోగనిరోధకశక్తి పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. వైరస్, బ్యాక్టీరియాలు, గుండె సంబంధిత వ్యాధులు రావట.
  • జుట్టు సమస్య ఉంటే రోజూ పాలకూర జ్యూస్‌ తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా చర్మం, ముఖంపై వృద్ధాప్య ఛాయలు, ముడతలు రాకుండా కాంతివంతంగా చేస్తుంది. జుట్టు రాలకుండా, బలంగా, దృఢంగా ఉండాలంటే ఈ జ్యూస్‌ బెస్ట్.
  • పాలకూర జ్యూస్‌లో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ పాలకూర జ్యూస్‌ తాగితే బరువు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read : నామినేషన్స్ రచ్చ మొదలైంది.. శేఖర్ భాష VS మణికంఠ..!

Advertisment
తాజా కథనాలు