Nutmeg Powder : పాలలో జాజికాయ పొడి కలిపి తింటే ఏమౌతుంది?..వైద్యులు ఏమంటున్నారు?

ప్రతీ రోజు పాలలో జాజికాయ పొడి కలిపి తాగితే నిద్రబాగా పడుతుంది. దీనిని తీసుకోవటం వలన అన్ని రకాల జలుబు, దగ్గు, ఒత్తడి, మంచిజీర్ణక్రియ, చర్మ సమస్యలు వంటివి తగ్గటంతోపాటు శరీరానికి ఇతర లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Nutmeg Powder : పాలలో జాజికాయ పొడి కలిపి తింటే ఏమౌతుంది?..వైద్యులు ఏమంటున్నారు?

Nutmeg Powder Benefits : నేటి కాలంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టాలంటే అందరికీ కష్టంతో కూడుకున్న పని. పాలు అంటే అందరికీ తెలుస్తుంది. ప్రతిరోజు పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే.. ఈ పాలలో జాజికాయ పొడి(Nutmeg Powder) కలిపి తీసుకుంటే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) పొందవచ్చు అంటున్నారు. జాజికాయతో ఆరోగ్య ప్రయోజనాలు పొందడంతో పాటు కొన్ని సమస్యలను కూడా దూరం చేస్తుందని అంటున్నారు. జాజికాయ పొడి పాలలో కలుపుకొని తాగితే అన్ని రకాల జలుబు, దగ్గు, శరీరానికి ఇతర లాభాలు ఉన్నాయి. జాజికాయ, పాలతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

నిద్ర సమస్య దూరం:

  • ప్రస్తుత కాలంలో నిద్రలేని సమస్య అనేది అందర్నీ వేధిస్తున్నది. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ప్రశాంతంగా ఏడు గంటలు నిద్రపోవడం కుదరని పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే సమయంలో గ్లాసుడు పాలలో కొంచెం జాజికాయ పొడి కలుపుకొని తాగితే నిద్ర సులభంగా పట్టడంతో పాటు ఒత్తిడిని కూడా దూరం చేస్తుందని అంటున్నారు నిపుణులు.

మంచి జీర్ణక్రియ:

  • పాల(Milk) లో జాజికాయ పొడి కలుపుకొని తాగితే కడుపుబ్బరం వంటి సమస్యను దూరం చేయడంతో పాటు అజీర్ణం సమస్యను తగ్గిస్తుంది. రోజు తినే ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుందంటున్నారు.

చర్మ సమస్యలు దూరం:

  • పాలు, జాజికాయ కలిపిన మిశ్రమాన్ని తీసుకున్న, ప్రతిరోజు మొహానికి రాసుకున్న చర్మ సమస్యలు(Skin Diseases) రావంటున్నారు. అంతేకాకుండా దీనిని ఎక్కువగా తీసుకుంటే జుట్టుకు మేలు జరిగి మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి :  అందుకే ఆ మొక్క పేరు సిగ్గాకు.. దీని ఆకులు తింటే ఆ కోరికలు ఆగనే ఆగవట!

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి : ఎక్కువగా తింటున్నారా?.. అయితే డిప్రెషన్ ముప్పు తప్పదు తెలుసా?

Advertisment
తాజా కథనాలు