Mint Juice : వేసవిలో పుదీనా జ్యూస్‌ తాగితే ఈ సమస్యలు ఉండవు

పుదీనా నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వేసవిలో రోజూ ఒక గ్లాసు పుదీనా నీటిని తాగితే మెరిసే చర్మంతో పాటు శక్తి కూడా వస్తుంది. ఇది శరీరం, కడుపును చల్లగా ఉంచుతుంది. హీట్ స్ట్రోక్, ఎసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం నుంచి కూడా రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు.

Mint Juice : వేసవిలో పుదీనా జ్యూస్‌ తాగితే ఈ సమస్యలు ఉండవు
New Update

Mint Benefits : పుదీనా నీరు(Mint Juice) ఆరోగ్యానికి ఎంతో మేలు(Health Benefits) చేస్తుంది. అలాగే దీన్ని రోజూ తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా నీటిని ప్రతిరోజూ తాగాలి. ఇందులో ఫోలేట్, కాల్షియం, కెరోటిన్లు, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి ఉంటాయి. ఇది శరీరం, కడుపును చల్లగా ఉంచుతుంది. హీట్ స్ట్రోక్(Heat Stroke) నుంచి కూడా రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు.

publive-image

వేసవి(Summer) లో రోజూ ఒక గ్లాసు పుదీనా నీటిని తాగితే మెరిసే చర్మంతో పాటు శక్తి కూడా వస్తుంది. పుదీనా నీళ్లు తాగితే అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖంలో మెరుపు కనిపిస్తుంది. అంతేకాకుండా చర్మం మెరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. పుదీనా నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

publive-image

ఎసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా నీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. దీన్ని రోజూ తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. రోజూ పుదీనా నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని. దీంతో పాటు జుట్టు, చర్మం, కడుపు సంబంధించిన సమస్యలన్నీ నయమవుతాయని వైద్యులు చెబుతున్నారు.

publive-image

పుదీనాను వంటల్లో వాడినా కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఎండాకాలం చమట వాసన నుంచి కూడా పుదీనా రక్షిస్తుందని, శరీరాన్ని హైడ్రేటెడ్‌(Body Hydrated) గా ఉంచే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: చిన్న ఆకుతో ముఖంపై ముడతలన్నీ మాయం..మెరవడం ఖాయం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #summer-drink #heat-stroke-symptoms #mint-juice
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe