Winter Tea: అందం, ఆరోగ్యం మెరుగుపడాలంటే ఈ 'టీ' తాగండి..!! చలికాలంలో లవంగం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం టీని ఉపయోగించడం వల్ల పంటి నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 29 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Clove Tea: ప్రస్తుత కాలంలో టీ ప్రతి ఒక్కరి దినచర్యలో భాగమైపోయింది. అంతేకాదు కొందరి జీవితంలో టీ అంతర్భాగంగా మారింది. ఉదయం ఒక కప్పు టీతో రోజూని ప్రారంభిస్తారు. ప్రజలు సాదా, స్పైసీ, హెర్బల్ టీని ఎక్కువగా తాగుతారు. కానీ..టీలో కూడా అనేక ఔషధ మూలకాలున్నాయి. ఇది మన శారీరక సమస్యలను దూరం చేస్తుందని తెలుసా..? ఇది ఎనర్జీ డ్రింక్ కంటే తక్కువ కాదు. ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టీని లవంగాలతో కలిపి తాగడం వల్ల చలికాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. అసలైన.. అటువంటి టీ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. టీలో అద్భుత గుణాలు లవంగం టీ చలికాలంలో తాగడం చాలా మంచిది. లవంగం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం అభిస్తుంది. అంతేకాకుండా..లవంగం టీ రోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. లవంగం టీలో యాంటీవైరస్, యాంటీ మైక్రోబియల్, యాంటిసెప్టిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఈ లక్షణాలు ఇన్ఫెక్షన్‌తో పోరాడి జలుబు, దగ్గు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. దీనితో పాటు..పొడి లేదా కఫం దగ్గుతో బాధపడేవారికి లవంగం టీ బెస్ట్. లవంగాలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది పొడి దగ్గును నయం చేస్తుంది. చర్మ సమస్యల నుంచి ఉపశమనం లవంగం టీ తాగడం వల్ల చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలలో యాంటీసెప్టిక్ గుణాలున్నాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. దీంతో చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగం టీతో బరువు కూడా తగ్గుతుంది. లవంగం టీని నిరంతరం తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు..లవంగం టీని ఉపయోగించడం వల్ల పంటి నొప్పి దూరం అవుతుంది. ఇది కూడా చదవండి: ఈ చిట్కాలతో చలి నుంచి పిల్లలను రక్షించుకోండి.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #health-benefits #health #beauty #clove-tea #winter-tea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి