Ambedkar: బౌద్ధమతాన్ని విశ్వసించిన అంబేద్కర్..22 ప్రతిజ్ఞలు

స్వాతంత్ర భారతదేశంలో డా.బి ఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర చాలా కీలకం. దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకుళ్ళేలా చేసిన అంబేద్కర్ చిరస్మరణీయుడు. అంతేకాదు మానవులకు బౌద్ధమే సరైన దారి చూపిస్తుందని ఆయన నమ్మారు.

New Update
Ambedkar: బౌద్ధమతాన్ని విశ్వసించిన అంబేద్కర్..22 ప్రతిజ్ఞలు

DR. B.R Ambedkar: భారతదేశ చరిత్ర గురించి చెప్పాలంటే అంబేద్కర్‌కు ముందు తరువాత అని చెప్పుకోవాలి. సామాజిక అసమానతలు, వివక్షలతో ఉన్న భారతదేశానికి ఒక దిశా నిర్ధేశం చేసిన ఘనుడు అంబేద్కర్. అందరూ సమానమనే భావనను కలిగిస్తూ, ఎవరూ చెరిపివేయలేని శాసనాన్ని రాజ్యాంగం (Constitution) రూపంలో లిఖించారు అంబేద్కర్‌. మన దేశంలో సాంస్కృతిక పరివర్తనతో కూడిన సామాజిక, రాజకీయ విప్లవం తీసుకురావాలని అంబేద్కర్‌ మొదట్నుంచి ఆకాంక్షించారు.నాటి పరిస్థితులకు అనుగుణంగా సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చారు.అణగారిన, వెనుకబడిన వర్గాలకు, స్త్రీలకు రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచారు.

వివక్షకు వ్యతిరేకంగా బౌద్ధమత స్వీకరణ..

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అంబేద్క్ర్ తొలి న్యాయమంత్రి అయ్యారు. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు...ఒక శక్తి అని చెప్పుకోవచ్చును. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1956 అక్టోబర్ 14న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. వివక్షను ఎదుర్కోవడానికి బౌద్ధమతమే సరైనది అని ఆయన భావించారు. ఈ సందర్భంగా ఆయన 22 ప్రతిజ్ఞలను కూడా చేశారు. అవి ఇప్పటికీ చర్చలో ఉన్నాయి. నాగ్‌పూర్‌లో దీక్ష భూమిలో అంబేద్కర్ తన అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అప్పుడు ఈ క్రింది ప్రతిజ్ఞలు ఆయన చేశారు.

--బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను దేవుళ్లుగా నేను పూజించను.
--రాముడిని, కృష్ణుడిని దేవుళ్లుగా కొలవను, లేదా వారిని ప్రార్థించను.
--గౌరి-గణపతి వంటి హిందూ దేవతలను, దేవుళ్లను నేను గౌరవించను, కొలవను.
--భగవంతుడు మానవ అవతారం ఎత్తాడనే దాన్ని నేను నమ్మను.
--గౌతమ బుద్ధుడు విష్ణువు అవతారమనేది తప్పు. నేను నమ్మను. ఇది తప్పుడు ప్రచారం.
--శ్రాద్ధ పక్షను(హిందూ సంప్రదాయ కర్మ కాండలను) నేను చేయను.
--బౌద్ధ మతానికి సరితూగని ఎలాంటి పనులను చేపట్టను.
--బ్రాహ్మణుల చేతుల మీదుగా ఎలాంటి పనులను, కార్యక్రమాలను చేపట్టను.
--మనుషులందరూ సమానులేనని నేను నమ్ముతాను.
--సమానత్వాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తాను.
--తథాగత బుద్ధ నేర్పించిన అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తాను.
--తథాగత బుద్ధ చెప్పిన పది నీతి సూక్తులను నేను పాటిస్తాను.
--జంతువులన్నింటి పట్ల నేను కరుణతో ఉంటాను.
--నేను దొంగతనం చేయను.
--వ్యభిచారం లాంటి పనులు చేయను.
--అబద్ధం చెప్పను.
--మద్యం తాగను.
--బౌద్ధ ధర్మంలోని మూడు సిద్ధాంతాలు ప్రజ్ఞ, సన్మార్గం, కరుణ జీవితాంతం పాటిస్తాను.
--జన్మతహా వచ్చిన నా హిందూ మతాన్ని త్యజిస్తాను. అది మానవ ప్రగతికి విరోధం కలుగ జేస్తుంది. --మనుషులను సమాన దృష్టితో చూడనివ్వదు. అందుకే బౌద్ధమతాన్ని స్వీకరించాను.
--బౌద్ధ ధర్మం మాత్రమే నిజమైన మతమని నేను నమ్ముతున్నాను.
--నాకు ఇవాళ పునర్జన్మ ఎత్తినట్లు ఉంది.
--బుద్ధుడి బోధనలను జీవితాంతం అనుసరిస్తానని ప్రమాణం చేస్తున్నాను.

అంబేద్కర్ ఇవి ఎందుకు చేశారు...

అంబేద్కర్ ఈ ప్రతిజ్ఞల వెనుక ఉద్దేశం ఎవరినీ కించరచడం కాదు...హిందే దేవుళ్ళను అవమానించడం అంతకంటే కాదు. విగ్రహాలను కొలవడం, ఆచారాలను, అద్భుతాలను నమ్మే సమాజం నుంచి వారు స్వేచ్ఛను పొందాలనుకున్నారు దాని కోసమే వీటిని చేశారు. బౌద్ధ పుస్తకాలను చదవడం, ఆ బాషలను అర్ధం చేసుకోవడం అందరికీ అయ్యే పని కాదని ఆయన భావించారు. దానికోసమే అందులో ఉన్న దానిని తన సొంత భాషలో , సరళంగా చెప్పడానికి ప్రయత్నించారు. దానినిఏ ప్రతిజ్ఞల రూపంలో చేశారు. దీంతో పాటూ తాను విభిన్నమైన జీవ విధానాన్ని అలవర్చుకున్నానని చెప్పడానికి కూడా ప్రయత్నం చేశారు. తనలాగే చాలా మంది ఇందులోకి రావాలని అంబేద్కర్ అభిలషించారు.

అంబేద్కర్ దృష్టి బౌద్ధం...

బౌద్ధమతం అంటే ద్వేషాలను రూపుమాపడమే అని నమ్మారు అంబేద్కర్. ఈ ప్రతిపదికను నడుస్తున్న వ్యవస్థను తిరస్కరించడం అని భావించారు. మతం, వ్యవస్థలు మానవత్వం చూపని మనుషులకు, అధికారం, గౌరవం, సంపద ఇవ్వని మనుషులకు కొత్త గుర్తింపు ఇవ్వడానికి అంబేడ్కర్ ప్రయత్నించారు. వారి దృష్టిలో బౌద్ధాన్ని స్వీకరించడం అంటే మతం మారడం మాత్రమే కాదు. అదొక సామాజిక విప్లవం కూడా. మతంతో ముడిపడిన్న మానసిక బానిసత్వాన్ని తిరస్కరించడానికి అంబేడ్కర్ ఈ ప్రతిజ్ఞలు చేశారు అని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:Ambedkar Jayanti: సమసమాజ స్వాప్నికుడు.. న్యాయ కోవిదుడి జయంతి నేడు!

Advertisment
తాజా కథనాలు