/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-1-jpg.webp)
Bomb E-mail Received Schools : ఈమధ్య కాలంలో స్కూల్స్(Schools) లో బాంబులు పెట్టారంటూ బెదిరింపు మెయిల్స్(Threatening Mails) రావడం చాలా ఎక్కువ అయిపోయాయి. నిన్నటికి నిన్న దేశంలో 10 విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామంటూ బెదిరింపు ఈ మెయిల్స్ రాగా... ఇవాళ ఢిల్లీ(Delhi) లో ఏకంగా యాభై పాఠశాలల్లో బాంబులున్నాయి అంటూ ఈ మెయిల్స్ వచ్చాయి. ముందు ద్వారకాలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, సంస్కృతి స్కూల్, సౌత్ డిల్లీలోని అమిటీ స్కూల్‌స్లో బాంబులు ఉన్నాయంటూ లేఖలు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. తరువాత ఈ సంఖ్య పెరుగుకుంటూ పోయింది. ఇప్పటికి మొత్తం ఢిల్లీలోని 50 స్కూల్స్‌కు బాంబ్ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఈరోజు ఉదయం ఆరుగంటలకు స్కూలు యాజమాన్యం ఈ మెయిల్స్ ను రిసీవ్ చేసుకున్నాయి. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పాటూ పిల్లలను వెంటనే స్కూల్ నుంచి పంపిచేశారు. మరోవైపు డిల్లీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్. ఫైర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు స్కూల్స్‌కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు బాంబులు ఏమీ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.
Delhi | Information was received regarding a bomb in Delhi Public School, Dwarka. Delhi Police, Bomb Disposal Squad and fire tenders have arrived on the spot. Search is underway: Delhi Police
— ANI (@ANI) May 1, 2024
బెంగళూరు, చెన్నైల్లో కూడా..
అంతకు ముందు బెంగళూరు(Bangalore), చెన్నై(Chennai) ల్లోని స్కూల్స్‌కు కూడా ఇలానే బాంబులు ఉన్నాయంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. బెంగళూరులో 8, చెన్నైలో ఐదు పాఠశాల్లో బాంబులు ఉన్నాయంటూ ఈ మెయిల్స్ వచ్చాయి. అయితే అక్కడ కూడా ఎటువంటి బాంబులు దొరకలేదు. కానీ పిల్లలు, తల్లిదండ్రులు మాత్రం చాలా భయపడిపోయారు. ఢిల్లీలో కూడా ఈ మూడు స్కూల్స్‌కు ఈరోజు సెలవులు ఇచ్చేశారు. పరిస్థితిన బట్టి రేపు స్కూల్ ఉంటుందో లేదో చెబుతామని పాఠశాల యాజమాన్యం చెబుతోంది.