Salar: సలార్ పై అనుమానాలు.. ఈసారి కొత్తగా

రాబోయే పాన్-ఇండియన్ బిగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్, సాలార్ ప్రస్తుతం రీషూట్ దశలో ఉంది. తాజా సమాచారం ఏంటంటే, ప్రశాంత్ నీల్ పాత క్లైమాక్స్‌తో సంతృప్తి చెందలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో క్లయిమాక్స్ పార్ట్ ను రీషూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Salaar Movie: 'సలార్' ఖాతాలో మరో రికార్డ్..దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్‎లో  ఉత్తమ చిత్రంగా ఎంపిక..!!
New Update

రాబోయే పాన్-ఇండియన్ బిగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్, సాలార్ ప్రస్తుతం రీషూట్ దశలో ఉంది. తాజా సమాచారం ఏంటంటే, ప్రశాంత్ నీల్ పాత క్లైమాక్స్‌తో సంతృప్తి చెందలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో క్లయిమాక్స్ పార్ట్ ను రీషూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు క్లయిమాక్స్ కు సంబంధించిన స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేశాడంట ప్రశాంత్ నీల్. ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. లెక్కప్రకారం, ఈ నెలాఖరుకు విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దీనికి కారణం క్లయిమాక్స్ సరిగ్గా రాకపోవడమే అని తెలుస్తోంది. క్లయిమాక్స్ పై దర్శకుడు సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత, అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తారు.

అయితే తాజా పరిణామాలు సలార్ బిజినెస్ పై ఎలాంటి ప్రభావం చూపించవని భావిస్తోంది ట్రేడ్. ఎందుకంటే, ఈ సినిమాలో ఉన్నది బాహుబలి హీరో, ఇక ఈ సినిమాను డైరక్ట్ చేస్తోంది కేజీఎఫ్ దర్శకుడు. కాబట్టి సలార్ ఎప్పుడు థియేటర్లలోకి వచ్చినా అది హాట్ కేక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన రికార్డులను సృష్టించడం ఖాయం అంటోంది ట్రేడ్.

సలార్ సినిమా ఓవర్సీస్ హక్కులు 36 కోట్లకు అమ్ముడయ్యాయి ఇది ఆర్ఆర్ఆర్ తర్వాత 2వ అతిపెద్ద ప్రీ-రిలీజ్ బిజినెస్ గా నిలిచింది. ఖర్చులతో కలిపి, బ్రేక్ ఈవెన్ మార్క్ సాధించాలంటే ఓవర్సీస్ లో ఈ సినిమా 10 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఇక నాన్-థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. సలార్ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది.

ఇక డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. తెలుగుతో పాటు, తమిళం-కన్నడ భాషల డిజిటల్ రైట్స్ కూడా నెట్ ఫ్లిక్స్ పరమయ్యాయి. వీటితో పాటు ఆడియో రైట్స్ కూడా కలిపి చూసుకుంటే.. సలార్ నాన్-థియేట్రికల్ బిజినెస్ 350 కోట్ల రూపాయలకు చేరుకుంది. అలా నాన్-థియేట్రికల్ రైట్స్ తోనే ఈ సినిమా దాదాపు 70శాతం బ్రేక్ ఈవెన్ సాధించింది.

కెజిఎఫ్‌ సిరీస్‌ తీసిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది ‘సాలార్‌’ సినిమా. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

#business #rrr #salar #pan-indian #next #2nd #biggest #pre-release
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe