Murder : టీ ఇవ్వమని అడిగి మరీ.. పిల్లలను చంపేశాడు!

ఉత్తర్‌ప్రదేశ్‌ లో ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపిన నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో నిందితుడు చిన్నారులను చంపినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు టీ కావాలని బాధితుల ఇంటికి వెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది.

Crime: రూ. 600 కోసం కన్నకూతురి గొంతు కోసిన తండ్రి!
New Update

Murder Case : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) బదౌన్‌లో ఇద్దరు చిన్నారుల మృతి యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ హత్యాకాండ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాల వాతావరణం నెలకొనడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పిల్లలను హత్య చేసిన నిందితుడు సాజిద్ కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించాడని పోలీసులు తెలిపారు.

యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్బర్ షాప్(Barber Shop) నిర్వహిస్తున్న సాజిద్ అనే వ్యక్తి ఉదయం 8 గంటల ప్రాంతంలో తన షాపు ముందు ఉన్న వినోద్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. వీరిద్దరికీ ఇంతకుముందే పరిచయం ఉందని, వారి మధ్య పాత గొడవలు జరుగుతున్నాయని సమాచారం. వినోద్ ఇంటికి వెళ్లిన సాజిద్ ముందుగా వినోద్‌ భార్యని టీ చేయమని అడిగాడు. అనంతరం టెర్రస్‌పైకి వెళ్లి వినోద్‌ ముగ్గురు పిల్లలు ఆయుష్‌, అహాన్‌, పీయూష్‌లపై పదునైన ఆయుధంతో దాడి చేయడం ప్రారంభించాడు. ఈ దాడిలో ఆయుష్ , అహాన్ మరణించారు, పియూష్‌కు స్వల్ప గాయాలు కావడంతో అతను స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు

ఇద్దరు చిన్నారులను హత్య(Murder) చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమీపంలోని పోలీసులు అతడిని పట్టుకోవడంతో పోలీసులపై దాడికి యత్నించాడు. ఆ తర్వాత సాజిద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌(Encounter) లో హతమార్చారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుడు సాజిద్‌ ఒక్కడేనని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు సాజిద్‌తో పాటు అతని సోదరుడు జావేద్ కూడా మృతుడి ఇంటికి వచ్చాడని పిల్లల తల్లి చెబుతోంది.

ఇప్పుడు పరిస్థితి ఏమిటి?

బదౌన్‌(Budaun) లో ఈ దారుణ హత్యాకాండతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏడీజీ బరేలీ, ఐజీ రాకేష్ సింగ్ ఘటనా స్థలంలో ఉండి శాంతిభద్రతలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ కొందరు నిరసనలు తెలిపారని పోలీసులు తెలిపారు. ఈ నిరసనల మధ్యే చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించినట్లు అధికారులు వివరించారు.

Also Read : గర్భవతిగా ఉన్నప్పుడు ఏం తినాలి..ఏం తినకూడదు అంటే!

#up #murder-case #encounter #childern
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe