Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా? రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్..!

‘డబుల్ ఇస్మార్ట్‌’ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఏకంగా రూ.33 కోట్లకు దక్కించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు.

New Update
Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా? రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్..!

Double Ismart Movie: తనదైన స్టైల్‌లో సినిమాలు తీసి తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. తన సినిమాలకు ఉన్న క్రేజ్‌ ఏంటో తాజాగా 'డబుల్ ఇస్మార్ట్‌' సినిమా నిరూపించింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ అమ్మకం ద్వారా భారీగా ఆదాయాన్ని రాబట్టింది.

30 కోట్లకు ఓటీటీ రైట్స్‌..

తెలుగు సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘డబుల్ ఇస్మార్ట్‌’ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) ఏకంగా రూ.33 కోట్లకు దక్కించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ఈ డీల్‌తో పూరి జగన్నాథ్‌ తన సినిమాకు ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించారు.

Also Read : సింగర్ KS చిత్ర సంగీత ప్రస్థానం గురించి ఈ విషయాలు తెలుసా?

లైగర్‌ ఫ్లాప్‌ అయినా అదే రెస్పాన్స్‌...

తన గత చిత్రం ‘లైగర్‌’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ, పూరి జగన్నాథ్‌ తన తదుపరి చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్‌’పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడవ్వడంతో రిలీజ్ కు ముందే ఈ మూవీ లాభాల బాట పట్టె అవకాశం ఉంది.

సోషల్ మీడియాలో చర్చ..

‘డబుల్ ఇస్మార్ట్‌’ ఓటీటీ రైట్స్‌ అమ్మకం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. పూరి జగన్నాథ్‌ అభిమానులు ఈ న్యూస్‌ను షేర్‌ చేస్తూ తమ హీరో సక్సెస్‌ను జరుపుకుంటున్నారు. 'డబుల్ ఇస్మార్ట్‌' ఓటీటీ రైట్స్‌ అమ్మకం ద్వారా పూరి జగన్నాథ్‌ మరోసారి తన మార్కెట్‌ వాల్యూను నిరూపించారు. ఆగస్టు 15 న థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Also Read: పావలా శ్యామలాకు సాయి ధరమ్ తేజ్ ఆర్ధిక సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు