/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-15T070736.359.jpg)
DOST Web Options Begins : తెలంగాణ(Telangana)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో(Degree College) ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST)లో ఈ నెల 20 నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి(Limbadri) సూచించారు. ఈ వెబ్ ఆప్షన్ల కోసం మే 30 వరకు గడువు ఉంటుందని తెలిపారు. గతంలో మే 15 నుంచి 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని చెప్పారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల వినతి మేరకు ఈసారి దాన్ని సవరించామని అన్నారు. మొత్తం 3 విడతల్లో ఈ డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను చేపట్టింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి.