వస్తువులు పట్టుకెళ్ళొద్దు..మాజీ మంత్రులకు సీఎస్ సూచన

ఒకవైపు తెలంగాణకు కొత్త సీఎం, మంత్రులు ప్రమాణం జరుగుతోంది. మరోవైపు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు.

New Update
Telangana: ఆ రహస్య మార్గాలపై నిఘా పెంచండి.. అధికారులకు సీఎస్‌ ఆదేశాలు

కొత్త మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. పాతవారు వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ అధికారిక నివాసాలను ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు విలువైన ప్రభుత్వ సామాగ్రీని తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ళు ఖాళీ చేస్తున్నప్పుడు పర్మిషన్ లేకుండా అక్కడి వస్తువులను తీసుకెళ్లొద్దని సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వస్తువులను తీసుకెళ్తే వాటికి తిరిగి రికవరీ చేస్తామని హెచ్చరించారు.

Also read:వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూజ చేసిన భట్టి విక్రమార్క

మరోవైపు ఎల్బీనగర్ స్టేడియంలో ఎనుముల రేవంత్‌ రెడ్డి అనే నేను.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఓపెన్ టాప్ జీపులో సోనియా గాంధీతో కలిసి వేదికపై వచ్చిన రేవంత్.. తెలంగాణ చీఫ్ మినిస్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై రేవంత్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisment
తాజా కథనాలు