Family Tips: మన అనుకుని వెళ్తే మనకే అనర్థం..ఎలాగో తెలుసా..? మనం ఎప్పుడూ సొంత కాళ్లపై నిలబడి మన గోల్ రీచ్ అవ్వాలి. అప్పుడే సంతోషంగా జీవించగలుగుతాం. మన అనుకున్న వాళ్ల దగ్గరకు సహాయం కోసం వెళ్లకండి. వారు సాయం చేయకపోతే ఆ బాధ జీవితాంతం ఉంటుంది. ఇలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. By Vijaya Nimma 16 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Family Tips: ఒకప్పుడు బంధాలు, బంధుత్వాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు వాటికి విలువ ఉండటం లేదు. మన అనుకుని దగ్గరికి వెళ్తే చివరికి మనకే తిప్పలు తప్పడం లేదు. ఎంతో ఆశతో వారి దగ్గరికి వెళ్తే వారు సహాయం చేయకపోగా మన పట్ల వ్యవహరించే తీరు చూస్తే బాధ కలగకమానదు. అందుకే ఎవరిపై ఆధారపడకుండా సొంతకాళ్లపై బతకడం నేర్చుకోవాలి. ఒకరి సాయం ఆశించి తరచూ బాధపడే కంటే సొంతగా బతకడం అలవాటు చేసుకుంటే జీవితం ముందుకు సాగుతుంది. మన అనుకున్న వాళ్లే మనకు సాయం చేయకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణణాతీతం. మనసులో ఇలాంటివి చిరస్థాయిగా ఉంటుంది: మనం మాత్రం మన వాళ్ల కోసం మన జీవితాలను సైతం త్యాగం చేస్తుంటాం. వాళ్లు మాత్రం స్వార్థం కోసం మనల్ని బలి చేయడానికి కూడా వెనకాడరు. తల్లిదండ్రుల మాట వినడం లేదని పిల్లలను కొడుతూ ఉంటారు. ఇలావాళ్లను కొట్టి చెడ్డవారు అవుతుంటారు. అలా చేయడం కంటే ముందుగా వాళ్లకు ఏది నచ్చుతుందో ఆ పనిచేస్తే తల్లిదండ్రులపై పిల్లలకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కొందరు పేరెంట్స్ అయితే పిల్లల కంటే బయట వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దీని వల్ల మన పిల్లలు కూడా మన మాట వినడం మానేస్తారు. పిల్లల మనసులో ఇలాంటివి చిరస్థాయిగా నిలిచిపోతాయి. బయట వాళ్లకైతే చేస్తారు: కొందరు మన అనుకున్నవాళ్లను పక్కనపెట్టి బయటి వాళ్లకు అయితే ఎక్కువగా సహాయం చేస్తుంటారు. అంతేకాకుండా మనపైనే నిందలు కూడా వేస్తుంటారు. చెప్పిన మాట వినడం లేదని, ఎదగరు అంటూ మనల్ని సూటిపోటి మాటలతో పొడుస్తుంటారు. తీరా పక్కవారికి సాయం చేస్తే వాళ్లు ఇలాంటి వాళ్లకు వెన్నుపోటు పొడిచిపోతారు. అప్పుడు మన విలువ తెలిసి వస్తుంది. అందుకే మనం వీలైతే సాయం చేయాలి, లేకుంటే దూరంగా ఉండాలి. అలాంటి వారి సహాయం అస్సలు తీసుకోకుండా ఉంటేనే ఉత్తమం. సొంత కాళ్లపై నిలబడి మన గోల్ రీచ్ అవ్వాలి. అప్పుడే సంతోషంగా జీవించగలుగుతాం. ఇది కూడా చదవండి: ఐదు నిమిషాల కంటే అతిగా ఫోన్ మాట్లాడితే కలిగే అనర్థాలు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #family-tips #family-members #advice మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి