Life Partner: ఇలాంటి విషయాలను పొరపాటున కాబోయే పార్ట్నర్‌తో చెప్పకండి..?

పెళ్లికి ముందు కాబోయే భాగస్వామి గురించి కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫ్యామిలీ, స్నేహితులు, అత్త గురించి కాబోయే పార్ట్నర్‌తో అస్సలు మాట్లాడకూడదు చెబుతున్నారు. ఇలా చేస్తే సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

New Update
Life Partner: ఇలాంటి విషయాలను పొరపాటున కాబోయే పార్ట్నర్‌తో చెప్పకండి..?

యువతి, యువకులు పెళ్ళి కుదిరిన వెంటనే వారికి కాబోయే పార్ట్నర్‌తో గంటలు గంటలుగా ఫోన్లలో మాట్లాడుతుంటారు. పెళ్లి కాకుండానే వీరిద్దరూ వారివారి ఆలోచనలు పంచుకుంటారు. దీనివల్ల మంచి రిలేషన్‌షిప్ పెరుగుతుంది. కానీ.. మీకు కాబోయే భర్త లేదా భార్యతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల గురించి మాట్లాడ వద్దు. వీటివల్ల కుదిరిన సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. అయితే.. ఎలాంటి విషయాలు మాట్లకూడదో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఫ్యామిలీ:
అమ్మాయిలు ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళికి ముందే అబ్బాయి కుటుంబం గురించి తక్కువ మాట్లడితే చాలా మంచిది. ఇలా ఫ్యామిలీ గురించి ముందే అడిగితే ఫ్యూచర్‌లో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈ విషయాలకు దూరంగా ఉంటే బెస్ట్.
స్నేహితులు:
చాలామంది వారి ఉన్న స్నేహితుల గురించి ఎక్కువగా ఆరా తీస్తారు. పెళ్ళికి ముందే వారి స్నేహితులను పరిచయం చేయకపోవడం, వారితో మాట్లాడిచకపోవడమే ఉత్తమం. పొరపాటున పరిచయం చేస్తే.. వారివల్ల మీ విషయాలను తెలుసుకుంటారు. దానివల్ల గొడవలు జరిగి సంబంధం చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి.
అత్త గురించి:
పెళ్ళికి ముందే అత్త గురించి అడగకపోవడమే చాలా ఉత్తమం.

ఇది కూడా చదవండి: మూత్రపిండాల ఆరోగ్యానికి ఈ ఆహారాలు తీసుకోవాల్సిందే

ప్రతి ఒక్కరి లైఫ్‌లో పెళ్లి అనేది అతి ముఖ్యమైన ఘట్టం. ఒకప్పుడు పెళ్లిచూపుల్లో పెద్దలకు నచ్చితే వెంటనే పెళ్లి చేసుకునేవారు. అయితే.. ప్రస్తుత కాలంలో అలాంటి బంధాలు ఎక్కువ కాలం నిలబడటం లేదు. దానికి ప్రధాన కారణం మనల్ని అర్థం చేసుకునే పార్ట్నర్ దొరకకపోవటమే. అందుకే.. పెళ్లికి ముందు కాబోయే పార్ట్నర్‌తో కొన్ని విషయాలు మాట్లాడటం వల్ల వారి ప్రవర్తన, మనస్తత్వం గురించి తెలుసుకోవచ్చు. గరుడ పురాణంలో విజయవంతమైన, సంతోషకరమైన వైవాహిక జీవితానికి సంబంధించి అనేక రహస్యాలు చెప్పారు.

Advertisment
తాజా కథనాలు