Renu Desai: ప్లీజ్.. చిరాకు తెప్పించకండి: పవన్ ఫ్యాన్స్ పై రేణూ ఫైర్!

జూనియర్ పవన్ కల్యాణ్ అని పిలుపించుకోవడం అకిరాకు ఇష్టముండదని రేణూ దేశాయ్ చెప్పింది. 'అకిరా ఎప్పుడు నటిస్తాడా? అని నాకూ అతృతగా ఉంది. అకిరా సినీ ఎంట్రీపై ఇప్పుడే చర్చలు పెట్టి చిరాకు తెప్పించకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి' అంటూ ఫ్యాన్స్ ను రేణూ రిక్వెస్ట్ చేసింది.

Renu Desai: ప్లీజ్.. చిరాకు తెప్పించకండి: పవన్ ఫ్యాన్స్ పై రేణూ ఫైర్!
New Update

Pawan kalyan: జూనియర్ పవన్ కల్యాణ్ అని పిలుపించుకోవడం అకిరాకు, పవన్ కు కూడా ఇష్టముండదని రేణూ దేశాయ్ అన్నారు. పవన్ ఎమ్మెల్యేగా గెలవడంతో అకిరా.. తన తండ్రి పవన్ వెంటే ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అకిరాకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అకిరా అరంగేట్రం, తదితర అంశాలపై పవన్ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తుండగా.. కొందరి కామెంట్లపై రేణూ దేశాయ్ స్పందించారు. అకిరాకు కాని, ఆయన తండ్రి పవన్ కు కానీ జూనియర్ పవన్ కల్యాణ్ అని పిలిపించుకోవడం ఇష్టముండదని చెపపారు. మీ ఫీలింగ్స్‌ను అకిరా మీద బలవంతంగా రుద్దకండి అంటూ పవన్ ఫ్యాన్స్ కు సూచించారు.

'అకిరా పుట్టినప్పటినుంచి నేను అతనికి అభిమానినే. అతను ఎప్పుడు నటిస్తాడా అని నాకు ఎంతో అతృతుగా ఉంది. అయితే అంతకంటే ముందు నేను ఆయన తల్లిని. అతను ఏ నిర్ణయం తీసుకున్న గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది. అకిరా సినీ ఎంట్రీపై చర్చలు పెట్టి చిరాకు తెప్పించకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి' అంటూ అభిమానులను రిక్వెస్ట్ చేశారు.

ఆయనకే ఫోన్ చేసి చెబుతా..
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రేణు దేశాయ్ సందడే కనిపిస్తుంది. పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాను వరుసగా పోస్టులు పెడుతుంది. నాన్న విన్నింగ్ మూడ్‌లో అకిరా, ఆద్య అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేయగా తెగ వైరల్ అయింది. అలాగే తాజాగా పవన్ కళ్యాణ్, అకిరా నందన్ కలిసి ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. దీంతో రేణు దేశాయ్ భావోద్వేగానికి లోనైంది. అకీరా పీఎం వద్దకు వెళ్లడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చింది. ఇక వపన్ అన్నయ్య గురించి ఏమైనా చెప్పొచ్చు కదా వదిన గారు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నించగా.. మళ్లీ నేను ఏం చెప్పినా అందరూ అటెన్షన్ కోసమే మాట్లాడుతున్నాను అంటారు. ఏదైనా చెప్పాలి అనుకుంటే నేరుగా ఆయనకే ఫోన్ చేసి చెబుతాను కాబట్టి, మీరందరూ సంతోషంగా ఉండండి అని రిప్లే ఇచ్చింది.

#pawan-kalyan #akira #renu-desai
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe