Praneeth Hanumanthu : డాంక్..! (Donk) ఈ పదం అర్థమేంటో తెలుసా? తల్లి కొడుకుల రిలేషన్‌పై సెక్సిస్ట్ జోక్స్ వెయ్యడం.. తండ్రికూతుళ్లకు శారీరక సంబంధం అంటగడుతూ జోక్స్ వెయ్యడం..! దీన్నే కొందరు డార్క్ హూమర్ (Dark Humor) అని పిలుస్తుంటారు. అయితే సోషల్‌మీడియా, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు (YouTube Content Creators) మాత్రం ఇది డాంక్. ఇలా చేయడం ఏ మాత్రం తప్పు కాదని బయట చెప్పుకుంటారు. నవ్విస్తున్నామనే ముసుగులో మానవ విలువలకు పాతరేస్తారు. వావివరసలు మార్చిపోయి అడ్డమైన కామెంట్స్ చేస్తుంటారు. యూట్యూబ్ కంటెంట్ క్రియెటర్ ప్రణీత్ హనుమంతు కూడా అలాంటివాడే. ఫణిమంతుగా యూట్యూబ్ సర్కిల్స్‌లో పాపులర్ అయిన ప్రణీత్ హనుమంతు చేసిన ఓ రోత కంటెంట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.
Dark Humor : యూట్యూబ్‌లో డాంక్ రోత.. తల్లి కొడుకులు, తండ్రికూతుళ్లపై సెక్సిస్ట్ జోక్స్!
డాంక్.. ఈ పదం సోషల్ మీడియా యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. తల్లి కొడుకులు, తండ్రికూతుళ్లకు శారీరక సంబంధం అంటగడుతూ జోక్స్ వెయ్యడాన్ని డార్క్ హూమర్ అంటారు. డాంక్ పేరిట యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు తమ రోతకు పెట్టుకున్న పేరు 'కామెడీ'.
Translate this News: