PM MODI: వికసిత్ భారత్ కోసం విరాళాలు ఇవ్వండి..దేశ నిర్మాణానికి అందరూ భాగస్వాములవ్వాలని ప్రధాని పిలుపు..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంతపార్టీకి విరాళం అందజేశారు. నమో యాప్ ద్వారా బీజేపీకి రూ. 2వేలు విరాళంగా అందజేశారు. వికసిత్ భారత్ కోసం అందరూ బీజేపీకి విరాళం ఇచ్చి...దేశ నిర్మాణానికి అందూ భాగస్వాములవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

PM MODI: వికసిత్ భారత్ కోసం విరాళాలు ఇవ్వండి..దేశ నిర్మాణానికి అందరూ భాగస్వాములవ్వాలని ప్రధాని పిలుపు..!
New Update

PM Modi contributes Rs 2000 to BJP fund: భారత ప్రధాని నరేంద్రమోదీ బీజేపీకి రూ. 2వేలు విరాళంగా అందజేశారు. నమో యాప్ ద్వారా శనివారం ఈ విరాళాన్ని అందజేశారు. వికసిత్ భారత్ ను నిర్మించేందుకు తాను దోహదపడ్డానని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. నమో యాప్ ద్వారా డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ (Donation for Nation Building)ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. కాగా ఈ విరాళానికి సంబంధించిన స్లిప్ ను మోదీ షేర్ చేశారు. బీజేపీకి దోహదపడటం..వికసిత్ భారత్ నిర్మాణం కోసం మన ప్రయత్నాలను బలోపేతం చేయడం సంతోషంగా ఉంది. నమో యాప్ (Namo App) ద్వారా ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుతున్నాను అంటూ మోదీ ట్వీట్ చేశారు. సామాన్య ప్రజలను కూడా విరాళాలు ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. నమో యాప్ ద్వారా విరాళాలు ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేను కూడా కోరుతున్నాను అన్నారు.

జేపీ నడ్డా కూడా విరాళం అందించారు:
అంతకుముందు మార్చి 1న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నెడ్డా కూడా పార్టీకి విరాళం అందించారు. అతను బిజెపికి రూ. 1,000 విరాళంగా ఇచ్చాడు. దాని స్క్రీన్‌షాట్‌ను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సమయంలో నడ్డా మాట్లాడుతూ, "భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చాలనే ప్రధాని మోదీ దార్శనికతకు నా వ్యక్తిగత మద్దతునిచ్చేందుకు నేను బీజేపీకి విరాళం ఇచ్చాను. మనమందరం ముందుకు వచ్చి నమో యాప్ ద్వారా నేషన్ బిల్డింగ్ జన ఆందోళన్ కోసం ఈ విరాళాన్ని అందజేద్దాం. చేరండి. "అంటూ పేర్కొన్నారు.

ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు నిషేధం:
గత నెల, సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నిషేధించిన సంగతి తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించింది. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు.

ఇది కూడా చదవండి:  హైదరాబాద్ లాడ్‎బజార్ లక్క గాజులకు జీఐ ట్యాగ్..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

#pm-modi #bjp #namo-app #pm-modi-donates-rs-2000-to-bjp #viksit-bharat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe