Trump : ట్రంప్‌పై దాడి.. అమాంతం పెరిగిన క్రేజ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడి జరిగిన తర్వాత ఆయకు ప్రజల్లో 8 శాతం మద్దతు పెరిగినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. దేశ అధ్యక్షునిగా ట్రంప్‌ను గెలిపించేందుకు 70 శాతం అవకాశాలున్నట్లు పేర్కొంది. By B Aravind 14 Jul 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Donald Trump Craze : అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై కాల్పుల దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్ తృటిలో తప్పించుకోగలిగారు. దీంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన షూటర్‌ను కాల్చి చంపారు. అలాగే ఈ ఘటనలో ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్ మద్ధతుదారుడు ఒకరు మృతిచెందారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రపంచవ్యాప్తంగా క్షణాల్లోనే వ్యాపించింది. కానీ న్యూయార్క్ (New York) లోని టైమ్ స్క్వేర్‌లో మాత్రం ఈ వార్త ప్రసారం కాలేదని పలువురు చెబుతున్నారు. ట్రంప్ కాల్పులు జరిగితే దానికి సంబంధించిన సింగిల్ వీడియో కూడా టైమ్ స్క్వేర్‌లో ప్రసారం కాలేదని.. అమెరికా ఫ్రంట్‌లైన్ డాక్టర్స్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డా. సిమోన్ గోల్డ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ దాడిపై ప్రపంచ దేశాధినేతలు స్పందిస్తుంటే ప్రముఖ టైమ్‌స్క్వేర్ మాత్రం పట్టించుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. Also read: నా పైన రెండు సార్లు హత్యాయత్నం జరిగింది..మస్క్! ఇక ట్రంప్‌పై దాడి జరిగిన మూడు గంటల్లోపే చైనా మార్కెట్లలో ట్రంప్ టీషర్టులు వచ్చేశాయి. దాడి జరిగిన అనంతరం ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో టీ షర్టులపై ముద్రించారు. ఐ విల్ నెవర్ స్టాప్, ఫైట్ ఫర్ అమెరికా, షూటింగ్ మేక్స్ మీ స్ట్రాంగర్ అంటూ ట్రంప్ అన్న ఈ వ్యాఖ్యలను టీషర్టులపై ముద్రించారు. మరోవైపు ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత ప్రజల్లో ఆయనకు మరింత మద్దతు పెరిగినట్లు పోలస్ స్టర్ తాజా నివేదికలో తెలిపింది. ఈ ఘటన తర్వాత ప్రజల నుంచి ట్రంప్‌నకు 8 శాతం మద్ధతు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. దీంతో జో బైడెన్ (Joe Biden) కంటే ట్రంప్ ముందు వరుసలో ఉన్నారని, దేశ అధ్యక్షునిగా ట్రంప్‌ను గెలిపించేందుకు ఏకంగా 70 శాతం అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే అంచనా వేసింది. Also Read: ట్రంప్‌పై కాల్పులు.. వివేక్ రామస్వామి ఏమన్నారంటే #telugu-news #donald-trump #new-york #times-square మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి