Donald Trump : మొదటి భార్యపై రేప్.. వివాదంలో ట్రంప్ బయోపిక్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ బయోపిక్‌ 'ది అప్రెంటిస్' అనే పేరుతో సినిమాపై ఆయన బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. ఈ సినిమాలో ట్రంప్‌ తన మొదటి భార్యపై అత్యాచారం చేసినట్లు చూపించడం దుమారం రేపుతోంది.

New Update
Trump: భారతీయ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..గ్రీన్‌ కార్డు ఇస్తానని ట్రంప్‌ హామీ!

America : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) బయోపిక్‌ ప్రీమియర్‌ షో (Biopic Premier Show) కొన్నిరోజుల క్రితం కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Cannes Film Festival) లో ప్రదర్శించారు. 'ది అప్రెంటిస్' అనే పేరుతో వచ్చిన ఈ సినిమాపై ఆయన బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. 1970, 1980లలో ట్రంప్‌ వ్యాపార రంగంలో ఎదిగిన వాటిని ఈ సినిమాలో చూపించారు. ఇందులో కొన్ని సీన్లు కల్పితమని.. ట్రంప్‌ ప్రతిష్ఠను దిగజార్చేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆయన బృందం ఆరోపణలు చేసింది. ఇదొక చెత్త చిత్రమని.. హాలీవుడ్ ప్రముఖుల కుట్ర అని అభివర్ణించింది. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ (Republican Party) నుంచి బరిలో ట్రంప్‌పై తన బయోపిక్ రావడం చర్చనీయమవుతోంది.

Also read: ఏపీలో రీపోలింగ్.. క్లారిటీ ఇచ్చిన సీఈఓ

ఇక వివరాల్లోకి వెళ్తే.. గతంలో ట్రంప్ దశాబ్దం పాటు నడిపిన టీవీ సిరీస్ టైటిల్‌ అప్రెంటిస్ అనే పేరును ఎంచుకొని సినిమా తీశారు. స్థిరాస్తి వ్యాపారిగా నిలదొక్కుకుంటున్న ఆయన తొలినాళ్ల జీవితాన్ని ఇందులో చూపినట్లు సమీక్షకులు తెలిపారు. ప్యామ్ అండ్ టామీ, డంబ్ మనీ తదితర చిత్రాల్లో నటించిన సెబాస్టియన్ స్టాన్‌ ఈ సినిమాలో ట్రంప్‌ పాత్రను పోషింటారు. ' అత్యాచారం, లైంగిక సమస్యలు, బట్టతల , ద్రోహం వంటి సన్నివేశాలతో సినిమా ప్రథమార్ధాన్ని ట్రంప్‌పై సానుభూతి చిత్రీకరించారని చూసినవాళ్లు వెల్లడించారు.

క్రమంగా లాయర్‌ రాయ్‌ కోన్ పరిచయం అయిన తర్వాత ట్రంప్ వ్యక్తిత్వం ఎలా రూపాంతరం చెందిందో చూపించినట్లు పేర్కొన్నారు. అధికారం, డీల్ మేకింగ్‌లో మెలకువలు తెలుసుకున్న అనంతరం ఆయన కఠింగా మారారని చెప్పారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై దర్శకుడు అలీ అబ్బాసీ కల్పితాలను జోడించి సినిమాను ఆసక్తికరంగా చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా ఇందులో తన మొదటి భార్య ఇవానాను ట్రంప్ అత్యాచారం చేసినట్లుగా చూపించడం తీవ్ర దుమారం రేపుతోంది. అయితే నిజజీవితంలో విడాకుల ప్రక్రియ కోర్టులో ఉన్న సమయంలో తనపై ట్రంప్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఇవానా ఆరోపించారు. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు ఆమె వెనక్కి తీసుకున్నారు. 2022లో ఆమె మరణించారు. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రను మరియా బకలోవా పోషించారు.

ట్రంప్ ప్రచారం బృందం డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ఈ చిత్రంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో చూపించినవన్నీ అబద్ధాలే అని పేర్కొన్నారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తారని.. ఆయన ప్రతిష్ఠ దిగజార్చేందుకే అలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరోవైపు ఈ వ్యవహారంపై డైరెక్టర్ అబ్బాసీ కూడా స్పందించారు. సినిమా చూడకుండా కోర్టులో సవాలు చేయడం సరికాదని హితువు పలికారు. ట్రంప్ ఈ సినిమా చూస్తే ఆశ్చర్యపోతారని.. ఆయన ఆగ్రహించరని చెప్పారు.

Also read: బ్రెయిన్ ఈటింగ్‌ అమీబాతో చిన్నారి మృతి..

Advertisment
తాజా కథనాలు