డోనాల్డ్ ట్రంప్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక పక్క కోర్టు కేసుల్లో వరుసగా చుక్కెదురు అవుతుంటే మరోవైపు ఇంట్లో ఆయన తోడబుట్టిన వారు ఒక్కొక్కరే మరణిస్తున్నారు. నిన్న తెల్లవారు జామున ట్రంప్ సోదరి మేరియన్ ట్రంప్ బారీ మృతి చెందారు. మేరియన్ న్యూయార్క్ లో ఒక అపార్ట్ మెంట్ లోనివాసం ఉంటున్నారు. మేరియన్ వయసు 86 సంవత్సరాలు.
Also read:మనగడ్డ మీద మనమే తోపులం..మనల్ని ఓడించడం కీవీస్ తరం కాదు
ట్రంప్ కు నలుగురు అక్కచెల్లెళ్ళు. అందులో మేరియన్ మూడవ వ్యక్తి. మేరియన్ న్యూజెర్సీలో ఫెడరల్ జడ్జిగా పని చేశారు. 2019లో ఈమె ఆ పదవి నుంచి రిటైర్ అయిపోయారు. గతేడాది ట్రంప్ తన సోదరుడిని కూడా కోల్పోయారు. ట్రంప్ సోదరుడు రాబర్ట్ ట్రంప్ గుండెపోటుతో మరణించారు.
ఇక డోనాల్డ్ ట్రంప్ ఆయన మీద కేసుల పరంగా కోర్టులకు హాజరు అవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ట్రంప్..న్యూయార్క్ ట్రయల్ కోర్టులో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫ్యామిలీ బిజినెస్‌కు చెందిన కేసులో ఆయన జడ్జితో వాదించారు. పదేపదే జడ్జిను తప్పుపట్టేందుకు ట్రంప్ ప్రయత్నించారు. సుమారు నాలుగు గంటల పాటు ట్రంప్.. కోర్టులో విచారణ ఎదుర్కొన్నారు. తానేమీ బ్యాంకులను మోసం చేయలేదన్నారు. ట్రంప్ సంస్థ తమ ఆస్తులను విలువను అధికంగా చూపి, బ్యాంకుల వద్ద నుంచి అధిక మోతాదులో రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈకేసులో ట్రంప్ సంస్థపై 250 మిలియన్ల డాలర్ల జరిమానా విధించాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:అడ్డంగా బుక్కైన మంత్రి మల్లారెడ్డి.. నామినేషన్ రిజెక్టేనా?