USA : బైడెన్‌ను బలవంతంగా తొలగించారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి బలవంతంగా తొలగించారంటూ రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్ ఆరోపించారు. ఇది డెమోక్రాట్లు చేసిన పెద్ద కుట్రగా అభివర్ణించారు. అధ్యక్ష రేసులో నుంచి తప్పుకోకుంటే.. అవమానకర రీతిలో తొలగించాల్సి వస్తుందని సొంతపార్టీ నేతలే బెదిరించారని ఆరోపించారు.

New Update
USA : బైడెన్‌ను బలవంతంగా తొలగించారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump Claims Joe Biden Exit From 2024 Race : అమెరికా (America) అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ నేత జోబైడెన్‌ (Joe Biden) అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై రిపబ్లికన్‌ పార్టీ (Republican Party) అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. జో బైడెన్‌ను బలవంతంగా తొలగించారంటూ ఆరోపణలు చేశారు. ఇది డెమోక్రాట్లు చేసిన పెద్ద కుట్ర అంటూ.. మిన్నెసోటాలో శనివారం జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ' జో బైడెన్‌కు 1.4 కోట్ల ఓటర్ల మద్దతు ఉంది. పెద్ద కుట్రకు పాల్పడి అతడిని రేసు నుంచి తొలగించారు. అధ్యక్ష రేసులో నుంచి వెళ్లకుంటే.. అవమానకర రీతిలో తప్పించాల్సి వస్తుందని సొంతపార్టీ నేతలే బెదిరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ద్వారా బలవంతంగా తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారని' ట్రంప్‌ అన్నారు.

Also Read:  ట్రంప్‌ ఆధిక్యానికి బ్రేక్..కమలా ఎఫెక్ట్

ఆర్టికల్ 25లో ఏముంది ?

అధ్యక్షుడు శారీరకంగా, మానసికంగా అసమర్థుడని భావిస్తే.. ఉపాధ్యక్షురాలు సహా కేబినెట్‌కు ఆయన/ఆమెను అధ్యక్ష పదవి నుంచి తప్పించే అధికారం ఉంటుంది. 1963లో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌.కెన్నడీ హత్య జరిగిన తర్వాత అమెరికన్ కాంగ్రెస్ ఈ సవరణను తీసుకొచ్చింది. తదుపరి అధ్యక్షుడిని కూడా నిర్ణయించే అధికారం కూడా ఈ సవరణ తెలియజేస్తోంది.

డెమోక్రాట్ల బెదిరింపుల వల్లే అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడానికి బైడెన్‌ అంగీకరించారని ట్రంప్‌ అన్నారు. ఆ తర్వాత ఆయనను పొగడటం ప్రారంభించారంటూ ఎద్దేవా చేశారు. ఇదిలాఉండగా.. ఇటీవల జో బైడెన్ ఆరోగ్య పరిస్థితి బాలేదని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 81 ఏళ్ల వయసున్న బైడెన్.. జులై 20న అనూహ్యంగా అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు పూర్తి మద్దతు ఇచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం హారిస్‌కు మద్దతు తెలిపారు.

Also read: డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం.. కాల్పులు జరిపిన చోటే మళ్లీ!

ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీ (Democratic Party) ప్రతినిధుల ఆమోదంతో ఆమె అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్నారు. ఆగస్టు 19 నుంచి 22 వరకు జరగనున్న సమావేశంలో డెమోక్రాటిక్ ప్రతినిధులు అధ్యక్ష అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఈ ఏడాది నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎవరు అగ్రరాజ్యానికి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటారనేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.


Advertisment
Advertisment
తాజా కథనాలు