Easy Ways To Stay Young : యంగ్‌గా ఉండాలని చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. జీవనశైలి మార్పు వలన, ఆహారపు ఆటవట్ల (Food Habits)తో చాలామంది ఎక్కువ వయసు వారిలా కనిపిస్తారు. వయసు పెరిగే కొద్ది ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ.. శరీరం అనేక వ్యాధుల వలన ఈ కోరిక నెరవేరదు. ప్రస్తుత కాలంలో వయసు పెరిగే కొద్ది ఆరోగ్యం తగ్గుతుంది. ఇలా ఆరోగ్యం తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయని ఉంటారు. కలుషితమైన గాలి, ఎరువులు, నీరు, మందులు, రసాయనాలు ఎక్కువగా వాడిన ఆహారాలను తినటం వలన ఆరోగ్యం సమస్యలు వస్తాయి. వీటితో పాటు హైబ్రిడ్ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినటం వల్ల ఆరోగ్యం సమస్యలు వస్తాయి. అయితే.. వీటిని తిని ఆరోగ్యం పాడవడం నిజమే అయినా.. మన ఆరోగ్యం పాడవడానికి ప్రధాన కారణంమన మనసే అని వైద్య నిపుణులు అంటున్నారు.
Also Read: మీ పిల్లలు చదువులో రాణించాలంటే పల్లీపట్టీలుఇవ్వండి
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండాలని ఎంతో మంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వారు ముందుగా మనసును మార్పుకోవాలని అంటున్నారు. మన మనసు కొన్ని సందర్భాల్లో మన మాట వినదు. ఉదయ్ త్వరగా లేని వ్యాయామం చేద్దాం అనుకుంటారు, కానీ మన ఆలస్యంగా లేస్తాను అనుకోగానే వ్యాయామం తరువాత చేద్దాంలే అని మన మనసుకు అనిపిస్తుంది. వెంటనే మనం వ్యాయామం చేయడం ఆపేస్తారు. అంతేకాదు మనం ఉదయం నీద్ర లేవగానే టీ, కాఫీలు, నీరు తాగకుండా, రుచికరమైన టీఫిన్, అల్పాహారాలతోపాటు జంక్ ఫుడ్, కూరల్లో నూనె, ఉప్పు, కారం అధికంగా వేసుకుని మనసుకు ఏది తినాలనిపిస్తే మనం అది తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు అంటున్నారు. కావున మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ముందుగా మనసును మార్చుకుంటే చాలా మంచిదని వైద్యులు చేబుతున్నారు.
మనసుని అదుపులో ఉంచుకోవాలి
కొంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కొన్ని మెడిసిన్స్ (Medicines)వాడుతూ ఉంటారు. అలాంటి వారు విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తూ ఉంటారు. ఇలా మనసు చెప్పింది చేస్తూ ఉంటే ఆరోగ్యం క్షమిస్తుంది. ఇలా మనస్సు చెప్పిందే చేస్తూ ఉంటే మనకి ప్రధాన శత్రువు మనసే అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమస్యలను తరిమి కొట్టాలంటే మనసుని ఆధీనంలో ఉంచుకుంటే చాలా మంచిది. మనసు చెప్పినట్టు వినకూడదని అందరూ గమనించాలి. అదే కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకునేలా మన మనసుని తయారు చేసుకోవాలి. అలా అలవాటు పడినప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెడు అలవాట్లకు వెళ్లకుండా మనసుని అదుపులో ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మనసుని ఆధీనంలో ఉంచుకోని మంచి అలవాట్లను పాటించడం, మంచి ఆహారం తీసుకుంటే వయసు పెరిగినప్పటికీ మనం ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.