Health Tips: ఈ ఆసనాలతో మెడ, వెన్ను నొప్పులు పరార్‌

చాలా మందికి పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు నడుము నొప్పితో ఇబ్బంది పడుతు ఉంటారు. దీంతో కూర్చోలేరు.. పడుకోలేరు బాధపడుతుంటారు. త్రికోణాసనం, వజ్రాసనం ఆసనాలు ప్రయత్నిస్తే కొద్దిగా రిలీఫ్ వస్తుంది.

New Update
Health Tips: ఈ ఆసనాలతో మెడ, వెన్ను నొప్పులు పరార్‌

Health tips: సీజన్‌తో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ మెడ, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతోపాటు డైజెషన్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వీటిని దూరం చేసుకోవాలంటే రోజు ఎక్సర్సైజ్‌లతోపాటు యోగాలు కచ్చితంగా చేస్తారు. అయితే ఈ సమస్యలకు చెక్‌ పెట్టాలంటే కొన్ని యోగాసనాలు కచ్చితంగా ప్రాక్టీస్‌ చేయాలంటున్నారు వైద్య నిపుణులు.

త్రికోణాసనం: ఈ ఆసనం వేయడం వల్ల వెన్నెముక ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఈ ఆసనాన్ని ట్రయాంగిల్ పోజ్ అంటారు. మెదట నిటారుగా నిల్చొని రెండు కాళ్లను ఎడంగా పెట్టాలి. నిల్చున్నప్పుడు కాళ్లు 'వి' ఆకారంలో ఉండేలా చుసుకోని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ బాడీని కుడి వైపు వంచుతూ, ఎడమ చేతిని నిటారుగా పైకి లేపాలి. అప్పుడు కుడి చేతిని కిందకి చాచి మడమ వద్ద ఆనించాలి. తల పైకెత్తి ఎడమ చేతి వైపు చూడాలి.
వజ్రాసనం: ఈ ఆసనం చేసేటప్పుడు మోకాళ్ల మీద కూర్చోవాలి. అరచేతుల్ని మోకాళ్ల మీద లేదా తొడల మీద పెట్టుకోవాలి. దీన్ని డైమండ్ పోజ్ అంటారు. దీనివల్ల మైండ్ ప్రశాంతంగా ఉండి ఎసిడిటీ, గ్యాస్, మోకాళ్ల నొప్పుల వంటి సమస్యలు తగ్గిస్తుంది. శరీరానికి మంచి రిలీఫ్ వచ్చి తొడ కండరాలు బలంగా తయారవుతాయి. ఇలా చేస్తే వెన్ను నొప్పి తగ్గటంతో పాటు యూరినరీ సమస్యలు ఉంటే తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: గంజి తాగడం వల్ల లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

ఇలా రోజూ చేయడం వలన గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, అజీర్తి వంటివి తగ్గి.. డైజెషన్‌ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ బాగా జరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. అర చేతులు, మడిమలను బలంగా చేస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్ ముప్పు, వెన్నెముక సమస్యలు తగ్గుతాయి. ఇది బ్యాలెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతకాకుండా స్ట్రెస్, యాంగ్జెటీ నుంచి రిలీఫ్ వస్తుంది. ప్రెగ్నెంట్ మహిళలకు నార్మల్ డెలివరీకి బాగా ఉపయోగ పడుతుంది. వెన్నునొప్పికి యోగా ఆసనాలను సాధన చేయడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. అయితే, మీరు ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపగుతుంటే మంచి ఫిజియోథెరపిస్ట్‌ అభిప్రాయాన్ని తీసుకుంటే మంచిది. అయితే వెన్నునొప్పికి ఈ యోగా భంగిమలు ప్రయోజనకరంగా ఉన్నా.. కొన్ని పరిస్థితులకు సరైన చికిత్స కాకపోవచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు