/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/dog-2-jpg.webp)
రాత్రి 2గంటలు.. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ ఇంటి పెంపుడు కుక్క(Pet Dog) హాల్‌లోని మెట్ల కింద నిద్రపోతుంది. ఇంతలోనే డోర్ తెరుచుకున్న సౌండ్ ఆ కుక్క చెవికి వినపడింది. ఆ కుక్క పేరు లక్..సౌండ్ వినపడిన వెంటనే లక్ నిద్రలేచింది. మెల్లిగా నడుస్తూ మెయిన్ డోర్‌వైపు ఒంగోని చూసింది. ఎవడో ఒకడు మాస్క్ పెట్టుకోని చేతిలో రాడ్డు పట్టుకోని ఇంట్లోకి ముసుగుతో ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే లక్‌కు బుర్ర వెలిగింది. వీడు ఎవడో దొంగోడిలా ఉన్నాడేనని వాడి దగ్గరకు స్లోగా వెళ్లింది. కుక్క(లక్)ను చూసిన దొంగకు ముందు కాళ్లు వణికాయి. అయితే ఇది అరిచే కుక్క కాదులేననుకోని స్లోగా నడవడం మొదలుపెట్టాడు. అంతే లక్‌గాడు దొంగపైకి దూకాడు. గట్టిగా అరవడం మొదలు పెట్టాడు..! వెంటనే ఇంట్లో వాళ్లు ఉలిక్కి పడి లేచారు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా?
గన్ తీసి కాల్చాడు:
కుక్క వల్ల తాను దొరికిపోతున్నానని తెలుసుకున్న దొంగగాడు.. లక్(కుక్క)పై కాల్పులు జరిపాడు. జేబులోనే గన్ ఉంది ఆ విషయం కుక్క పసిగట్టలేకపోయింది. బుల్లెట్ గాయంతో విలవిలలాడింది. అయినా వెంటనే లేచింది. దొంగను మళ్లీ పట్టుకుంది. ఇంట్లో వాళ్లు స్టెప్స్ దిగి దొంగను పట్టుకునే వరకు అతడిని వదల్లేదు. ఈలోపే కిందకు వచ్చిన ఆ కుటుంబం పోలీసులకు ఫోన్ చేసింది. ఈలోపు ఇంట్లో ఉన్న అంకూల్ ఆ కుక్కను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికీ తీవ్ర రక్తంతో లక్(కుక్క) కొట్టుకుంటుంది. చనిపోతుందని అంతా అనుకున్నారు. కానీ కుక్క చావుతోనూ పోరాడింది. చివరకు గెలిచింది.
Dog shot during robbery given a warm send-off by hospital staff after undergoing three surgeries👏 pic.twitter.com/ciyroijXyE
— B&S (@_B___S) November 23, 2023
54 రోజులు.. శరీరంలో బుల్లెట్లు..!
ఆస్పత్రిలో చేరిన కుక్కకు మూడు సర్జరీలు చేశాడు వైద్యులు. 54 రోజుల పాటు కుక్కకు చికిత్స అందించారు. ఫిజికల్ థెరపీని కూడా ఇచ్చారు. 54 రోజుల చికిత్స తర్వాత ఎట్టకేలకు కుక్క ఇంటికి వెళ్లగలిగింది. కుక్క డిశార్జ్ సమయంలో ఆసుపత్రి సిబ్బందితో పాటు కుటుంబసభ్యులు, స్నేహితులు లక్‌ను అభినందించారు. వరుసగా నిలబడి చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: బుద్ధి బయటపెట్టుకున్నారుగా.. బంగ్లా ఫ్యాన్స్ తో జాగ్రత్తగా ఉండాలి భయ్యో!
WATCH: