Brain Memory : మతిమరుపు వేధిస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

అల్జీమర్స్‌ కేసులు 60-65 సంవత్సరాలు దాటినా వారిలోనే ఎక్కువ వస్తాయి. ఈ మధ్య 40-50 ఏళ్లు దాటిన వాళ్లలోనూ ఈ లక్షణాలు అధికంగా కనబడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, చేపలు, కోడిగుడ్డు, నల్ల మిరియాలు తింటే అల్జీమర్స్‌ వ్యాధి తగ్గుతుంది.

Brain Memory : మతిమరుపు వేధిస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
New Update

Food Habits : ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండటం అనేది అందరికి ఓ సవాల్‌గా మారిన విషయమే. జీవనశైలి(Life Style) లో ఎంతోమంది ఆహారపు అలవాట్లు(Food Habits), యోగా, ధ్యానం, వాకింగ్‌ వంటివి ఎన్ని చేసిన సంపూర్ణ ఆరోగ్యం అనేది దక్కడం లేదు. అయితే..ఈ మధ్యంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా మతిమరుపు(Forgetfulness) సమస్య వేధిస్తుంది. వారి వస్తువులు కూడా ఎక్కడ పెట్టారో మరిచిపోతారు. చాలామందికి బైక్ కీ, ఫోన్‌, ఇంట్లో వస్తువులు ఎక్కుడ పెట్టారో ఇటే మరిచిపోతారు. కొందరైతే సొంత కుటుంబ సభ్యులను గుర్తు పట్టలేరు. దీనికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరిలో వయస్సు పెరిగే కొద్దీ మెదడులోని కొన్ని న్యూరాన్‌లను కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. అలా ఎక్కువగా కోల్పోయినవారు 'అల్జీమర్స్' అనే మతిమరుపు వ్యాధి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

మతిమరుపు సంకేతాలు, లక్షణాలు 

  • సాధారణంగా అల్జీమర్స్‌(Alzheimer's) కేసులు 60-65 సంవత్సరాలు దాటినా వారిలోనే ఎక్కువ వస్తాయి. అయితే.. ఈ మధ్య 40-50 యేళ్లు దాటిన వాళ్లలోనూ ఈ లక్షణాలు అధికంగా కనబడుతున్నాయి. మెదడులోని ఉండే న్యూరాన్లు, నరాల కణాలు సరిగ్గా పని చేయడం తగ్గి పోవటం లేదా ఆగిపోవడంతో మతిమరుపు సంకేతాలు, లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వ్యాధిని 1901లో నిపుణులు గుర్తించారు. అయితే మతిమరుపు వ్యాధి గురించి అవగాహన అవసరం.

మతిమరుపునకు కారణాలు

  • వయసు పెరగడంతో బ్రెయిన్‌లోని న్యూరాన్ల సంఖ్య తగ్గి, పనితనం మందగించడమే అల్జీమర్స్‌కు ముఖ్య కారణమని వైద్యులు అంటున్నారు. విపరీత ఒత్తిడి, నిద్రలేమి, జీవన విధానంలో అనూహ్య మార్పులు, ట్రాఫిక్​సౌండ్, విటమిన్స్ బి1, బి12, బి6 లోపం వలన న్యూరాన్లు క్షీణించి ఈ వ్యాధి వస్తుంది. అంతేకాకుండా మూడీగా ఉండడం, అలోచనలు, డిప్రెషన్(Depression), ప్రవర్తనలో మార్పులకు కూడా వలన అల్జీమర్స్‌ ​లక్షణాలే.

ఇలా చెస్తే బెటర్

  • ఆరోగ్యకర జీవన శైలితో ఈ వ్యాధిని దూరం చేయాలంటే..60 ఏళ్ళు దాటాక మానసికంగా యాక్టివ్‌గా ఉండాలని వైద్యులంటున్నారు. రోజూ వ్యాయామం, ఆరోగ్యకర ఆహారం, సుఖనిద్ర, ఒత్తిడి లేకుండా ఉండాలి. మ్యూజిక్, పజిల్స్‌, బుక్ రీడింగ్ ​వంటివి మెదడుని యాక్టివ్‌గా ఉంచుతాయి. ముదురు రంగు పండ్లు ఎక్కువ తినాలి. నట్స్, అవకాడో, అప్రికాట్‌, బీన్స్, ఆలివ్​ఆయిల్, బెర్రీలు, చేపలు, కోడిగుడ్డు, నల్ల మిరియాలు, నెయ్యి , పసుపు వంటివి ​ డైట్‌లో ఉంటే అల్జీమర్స్‌ను తగ్గించవచ్చు.

ఇది కూడా చదవండి: రాత్రి మిగిలిన అన్నంతో అద్భుతమైన ఖీర్‌..తయారీ విధానం!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#forgetfulness #brain-memory #daily-life-style #food-habits
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి