Eating Bread : నిజంగా రొట్టె తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారా? ఈరోజుల్లో బరువు తగ్గాలనుకునే వారిలో ఎక్కువ మంది అన్నానికి బదులుగా రోటీ తింటున్నారు. అయితే.. నిజంగా రొట్టె తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారా? అన్నం తింటే బరువు పెరుగుతారా? నిపుణులు ఏం చెబుతున్నారు? By Durga Rao 17 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Bread : బియ్యం(Rice), రోటీ(Roti) ఈ రెండింటి పోషక విలువల్లో చాలా తేడా ఉంది. బరువు తగ్గాలనేవారు(Weight Loss) రెండూ తినాలని సూచిస్తున్నారు. అయితే.. వారానికి 4 రోజులు రోటీ తింటే.. 2 రోజులు అన్నం తినాలి. ఈ విధంగా మీరు మీ డైట్లో వెరైటీని కొనసాగించి వెయిట్ లాస్ అవ్వొచ్చని సూచిస్తున్నారు. అయితే.. గుర్తంచుకోవాల్సిన విషయం ఏమంటే.. బరువు తగ్గడం కోసం ఎప్పుడూ ఆకలితో ఉండకూడదట. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తుందంటున్నారు.చపాతీలో గ్లూటెన్ ఉంటే.. బియ్యంలో ఉండదు. కొందరికి గ్లూటెన్ ఇష్టముండదు. అలాంటి వారు తక్కువ మొత్తంలో రోటీలు, ఎక్కువ అన్నం తీసుకోవడం బెటర్. అయితే.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అన్నం కంటే రోటీ ఎక్కువ మేలు చేస్తుందని అంటున్నారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు అన్నం తినకపోవడం ఉత్తమం. జొన్నలు, రాగులు, మిల్లెట్(Millets) లతో చేసిన రోటీలు బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ చపాతీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయి వేగంగా పెరగదు. జొన్నలు, రాగులు, బజ్రాలతో చేసిన రోటీలు చాలా పోషకమైనవి. కాబట్టి ఇవి బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. ఒకవేళ మీరు రైస్ తింటూ బరువు తగ్గాలనుకుంటే.. బ్రౌన్ రైస్ మంచి ఎంపికగా చెబుతున్నారు నిపుణులు. వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ మంచి ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. Also Read : రాత్రిపూట పరోటా తింటున్నారా..అయితే మీ పని అవుటే.. బరువు తగ్గడానికి 10 ముఖ్యమైన చిట్కాలు : మీ డైట్లో ఫైబర్ తీసుకోవడం పెంచాలి. రోజువారీ 40 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. దాదాపు ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి. మీ ఆహారంలో ఉప్పు, చక్కెర పరిమాణాన్ని తగ్గించాలి. రిఫైన్డ్, ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్‌కు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వంటల కోసం సీడ్స్ ఆయిల్ ఉపయోగించేలా చూసుకోవాలి. రోజూ శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి. అలాగే డైలీ సరైన మార్గంలో వ్యాయామం చేస్తూ కండరాలలో శక్తిని పెంచుకోవాలి. మీ జీవనశైలిలో బరువు తగ్గడానికి అవసరమైన కొన్ని మార్పులు చేసుకోండి. ఆహారం, కూల్‌డ్రింక్స్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ఇక చివరగా వెయిట్ లాస్‌కు మీరు పాటించాల్సిన మరో చిట్కా.. ధూమపానం, మద్యపానాన్ని మానుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే త్వరలోనే మీ బాడీ వెయిట్లో మార్పు గమనిస్తారు. #rice #millets #roti #10-weight-loss-tips #eating-bread మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి