Hot Water Bath: వేడి నీటితో స్నానం చేస్తే సంతానోత్పత్తి తగ్గుతుందా?..నిపుణులు ఏమంటున్నారు?

ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే సంతానోత్పత్తి లేదా స్పెర్మ్ నాణ్యతపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. వేడి నీళ్లలో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అధ్యయనంలో గుర్తించారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేస్తే ఎటువంటి హాని ఉండదు.

Hot Water Bath: వేడి నీటితో స్నానం చేస్తే సంతానోత్పత్తి తగ్గుతుందా?..నిపుణులు ఏమంటున్నారు?
New Update

Hot Water Bath: చాలామంది చలికాలంలో స్నానానికి వేడి నీళ్లను ఉపయోగిస్తుంటారు. చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రత నరాల మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని, అలాంటి పరిస్థితుల్లో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో మాత్రం వేడి నీటితో స్నానం చేసే అలవాటు సంతానోత్పత్తిని దెబ్బతీస్తుందని ప్రచారం జరుగుతోంది.

సంతానోత్పత్తిపై వేడి నీటి ప్రభావం ఉంటుందా?:

  • వేడి నీళ్లు నిజంగానే సంతానోత్పత్తి లేదా స్పెర్మ్ నాణ్యతపై ప్రభావం చూపుతుందా అనే అంశంపై పరిశోధకులు పలు అధ్యయనాలు చేశారు. కొన్ని నివేదికలలో తరచుగా వేడి నీటితో స్నానం చేస్తే కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయని గుర్తించారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని యూరాలజిస్టులు ఈ విషయంలో పరిశోధనలు చేశారు. చాలా కాలం ఎక్కువ వేడి ఉన్న నీటితో స్నానం చేస్తే అది శరీరంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని అంటున్నారు.

ఎక్కువ వేడి నీళ్లతో కలిగే దుష్ప్రభావాలు:

  • నివేదికల ప్రకారం మానవ వృషణాలు సాధారణంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటాయి. ఇది శరీర ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలో కొన్ని డిగ్రీల పెరుగుదల కూడా స్పెర్మాటోజెనిసిస్‌కు అంతరాయం కలిగిస్తుందని పరిశోధకులు గుర్తించారు. అయితే కేవలం ఎక్కువగా అధిక వేడినీటితో స్నానం చేసేవారికే ఇలా జరుగుతుందని అంటున్నారు.

అధ్యయనం ఏం చెబుతోంది?:

  • 2007లో జరిపిన ఓ అధ్యయనంలో వారానికి కనీసం 30 నిమిషాల పాటు హాట్‌టబ్‌లను ఉపయోగించే పదకొండు మంది పురుషులపై ప్రయోగం చేశారు. వారిని మూడు నెలల పాటు వేడి ఉష్ణోగ్రతలకు గురికాకుండా చూశారు. ఐదుగురిలో మొత్తం మోటైల్ స్పెర్మ్‌కౌంట్ సగటున 491 శాతం పెరిగింది. అందుకే వేడికి ఎక్కువగా గురికావడం సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు.

ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?:

  • లక్నోకు చెందిన యూరాలజిస్ట్ మాట్లాడుతూ శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎటువంటి హాని ఉండదని అంటున్నారు. ఎక్కువ సేపు స్నానం చేస్తే మాత్రం చర్మ సంబంధిత సమస్యలతో పాటు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తింటే నొప్పి తగ్గుతుందా..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#hot-water #health-benefits #bath
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe