Late Night Sleep: ప్రస్తుత జీవనశైలిలో రకరకాల మార్పులు చూస్తేనే ఉన్నాము. ఒకప్పుడు రాత్రి 9 గంటలకే నిద్రపోయేవారు. ఉదయం 5 నుంచి 6 గంటలలోపు నిద్ర లేస్తారు. సూర్యోదయానికి ముందు నిద్ర లేచేవారు ప్రకృతి జీవనంతో ఆరోగ్యంగా ఉండేవారు. కారణాలేమైనా కొందరీలో మార్పులు, సమస్యలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. అలాంటి సమస్యల్లో లేట్‌నైట్ స్లీపింగ్ ఒకటి. కానీ.. ఇప్పుడు పెరుగుతున్న పట్టణీకరణ, బిజీ వర్క్ షెడ్యూల్స్, షిఫ్ట్‌వైజ్ ఉద్యోగాల వలన నిద్రవేళల్లో మార్పులు సహంజగానే ఉంటున్నాయి. ముఖ్యంగా సిటీల్లో అయితే ఎంతోమంది అర్ధరాత్రి 12 నుంచి 1 గంటల తర్వాతనే నిద్రకు ఉపక్రమించే పరిస్థితులు ఉన్నాయి. కొందరైతే రాత్రి 2 లేదా 3 గంటలకు నిద్రపోని వారు కూడా ఉన్నారు.
టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం
అయితే.. ఇలాంటి లేట్ నైట్ స్లీపింగ్ వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాంటి జీవనశైలి ఉంటే మాత్రం దీర్ఘకాలంపాటు కొనసాగే వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 19 శాతం పెరుగుతుందని తాజా చేసిన పరిశోధనలో వెల్లడైంది. పైగా రాత్రి లేట్‌గా పడుకునే వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినరు. సాయంత్రం తర్వాతే ఎక్కువగా తినడం వల్ల సహజ సిద్ధంగా జరిగే శరీర జీవక్రియలకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ పరిస్థితి బ్లడ్ షుగర్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది. దీంతో క్వాలిటీ స్లీప్ దూరం అవుతుందని నిపుణులు అంటున్నారు.
రాత్రుళ్లు తృణధాన్యాలతో చేసిన స్నాక్స్ బెస్ట్
లేట్ నైట్ అయినా కొందరూ అర్ధరాత్రి ఆకలి అనిపిస్తే ఫుడ్ తింటారు. అయితే తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు.
బెర్రీలు వంటి తింటే మంచిది. బెర్రీలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి..ఇవి పొట్టను నిండుగా ఉన్న ఫీల్‌ను కలిగిస్తుంది. అంతేకాదు వీటిలో ఉండే మెగ్నీషియం నరాల వ్యవస్థ ప్రశాంతంగా ఉంచుతుంది. దీని వలన మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. రాత్రుళ్లు ఆకలి అనిపిస్తే తృణధాన్యాలతో చేసిన స్నాక్స్ తీసుకోవచ్చు. అయితే వాటిలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ క్యాలరీలు ఉండాలి, ఆకలి తీరాలి అంటే క్యారెట్ తినడం మంచిది. బాదం, వాల్‌నట్స్‌లో ప్రొటీన్లు, మెగ్నీషియం, మెలటోనిన్ ఉంటాయి కాబట్టి ఆకలి తీరడంతో పాటు మంచి నిద్ర వస్తుంది. అంతేకాదు లేట్-నైట్ పని విధానాన్ని (Late-Night Work) నిషేధిస్తే అంత ఆరోగ్యానికి మంచిది వైద్య నిపుణులు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: శీతాకాలంలో గొంతు గరగర తగ్గించే చిట్కాలు ఇవే!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.