Fasting: ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మంది అనుకుంటారు. అంతేకాకుండా ఫాస్టింగ్ వల్ల అధిక కొలెస్ట్రాల్ కరిగిపోతాయని నమ్ముతారు. అయితే ఉపవాసం వల్ల గుండె జబ్బుల ముప్పుతప్పదని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేలింది. అంతేకాకుండా కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపడ్డాయి. ఆహారం తీసుకునే సమయం 8 గంటలకే కుదించడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అలాగే హార్ట్ ఫెయిల్యూర్‌తో మరణించే అవకాశం కూడా 91శాతం ఉంటుందని చికాగోలోని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం చెబుతోంది.
అధ్యయనం ఏం చెబుతోంది..?
- చికాగో సైంటిస్టుల బృందం సుమారు 20 వేల మందిపై ఈ పరిశోధన చేసింది. 12 నుంచి 16 గంటల వరకు ఎప్పుడో ఒకసారి ఆహారం తీసుకునేవారు, తరచూ తినేవారి మధ్య ఉన్న తేడాలపై స్టడీ నిర్వహించారు. ఈ అధ్యయనంలో సగటున 48 ఏళ్ల వయసున్నవారు పాల్గొన్నారు. అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉంటున్నవారిలో షుగర్, బీపీ, హార్ట్ సంబంధిత వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. టైమ్‌కి ఆహారం తీసుకునేవారితో పోలిస్తే తక్కువగా తినేవారిలో పలు సమస్యలు కనిపించాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా గుండె నాళాల్లో సమస్యలు వచ్చి మృతి చెందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
డేటాను ఎలా విశ్లేషించారు..?
- సైంటిస్టులు 2003 సంవత్సరం నుంచి 2019 వరకు ఈ అధ్యయనం చేశారు. ఈ సంవత్సరాల మధ్యకాలంలో మృతి చెందినవారి డేటా ఆధారంగా ఈ విషయాలు తెలిపారు. అయితే ఈ డేటా ఎంత వరకు సబబు అనేదానిపై మరింతగా పరిశోధనలు చేయాల్సి ఉందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. వాస్తవానికి అయితే జీర్ణాశయానికి 24 గంటలు విశ్రాంతి ఇచ్చి సులభంగా క్యాలెరీలను తగ్గించేందుకు ఉపవాసం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి హాని అనేది కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఉపవాసం సమయంలో ఆయా వ్యక్తుల ఇతర అలవాట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు.
ఇది కూడా చదవండి: చితాభస్మంతో హోలీ.. ఎక్కడో తెలుసా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.