Hair Tips: ఈ రెండు పనులు చేస్తే మీ జుట్టు పట్టుకుని లాగినా ఊడదు వేడినీటితో తలస్నానం చేస్తే తొందరగా జుట్టు రాలుతుందని వైద్యులు అంటున్నారు. వేడి నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గిపోవటంతోపాటు పోషకవిలువలు అందవు. చన్నీటి స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. శరీరానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Hair Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. వయసుతో పనిలేకుండా అందరూ జుట్టు రాలడంతో బాధపడుతుంటారు. యూత్ ఎక్కువగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. వెంట్రుకలు రాలిపోవడానికి చాలా కారణాలు ఉన్నా. ముఖ్యంగా వేడినీటితో స్నానం చేస్తే తొందరగా జుట్టు రాలుతుందని వైద్యులు అంటున్నారు. వేడి నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుందని, ఆక్సిజన్‌తో పాటు పోషకవిలువలు అందవని చెబుతున్నారు. అందరూ తల శుభ్రంగా ఉండాలని ప్రతిరోజు వేడి నీటితో తలస్నానం చేస్తారు. దీని వల్ల జుట్టు ఊడిపోతుంటుంది. చన్నీటితో స్నానం చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్ ముఖ్యం: ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి పోషకాలు అందుతాయి. మనకు ఏర్పడే ఒత్తిడి, తలలో వేడి వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందని చెబుతున్నారు. చన్నీటి స్నానంతో జుట్టు రాలడం తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. ఇక జుట్టు రాలడానికి మరో కారణం ప్రోటీన్ లోపం. జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఊడిపోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడానికి, ఒత్తుగా, పొడుగ్గా పెరగడానికి ప్రోటీన్ ఎంతో ముఖ్యం. శరీరానికి కావల్సిన ప్రోటీన్: జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నవారు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మిల్ మేకర్‌లో ప్రొటీన్ సంవృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల మిల్ మేకర్‌లో 53 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది. వీటిని తింటే శరీరానికి కావల్సిన ప్రోటీన్ లభిస్తుంది. ప్రొటీన్‌తో జుట్టు ఒత్తుగా ఉంటుంది. అలాగే ఆకుకూరలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆకుకూరల వల్ల శరీరంలో రక్తం బాగా వృద్ధి చెందుతుంది. జుట్టు కుదుళ్లకు రక్తం బాగా అంది బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: బయటపడిన 112 ఏళ్ల నాటి టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #hot-water #hair-tips #head-bath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి