విజయవాడలోని ఓ వైద్యురాలి అప్రమత్తత ఆరేళ్ల బాలుడిని కాపాడింది. రోడ్డుపైనే సీపీఆర్ చేసి ఆ బాలుడిని రక్షించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని అయ్యప్పనగర్‌లో ఉంటున్న సాయి (6) కరెంట్ షాక్‌కు గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కొడుకును భుజాన వేసుకొని తల్లిదండ్రులు ఆసుపత్రికి పరిగెత్తారు. వాళ్లకి సాయం చేసేందుకు రవళి అనే వైద్యురాలు ముందుకొచ్చారు. బాలుడిని రోడ్డుపైనే పడుకోబెట్టి సీపీఆర్ చేశారు.
Also Read: కోవిషీల్డ్ మాత్రమే కాదు.. కోవాక్సిన్‌తో కూడా సైడ్ ఎఫెక్ట్స్..
ఏడు నిమిషాలకు పైగా సీపీఆర్ చేశాక బాలుడిలో కదలికలు రావడం మొదలయ్యాయి. వైద్యురాలి కృషి ఫలించడంతో బాలుడు సాయి మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత దగ్గరిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేశాక ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. ఆ తర్వాత వైద్యులు బాలుడిని ఇంటికి పంపించారు. బాలుడిని కాపాడిన వైద్యురాలు రవళికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also read: వివాహేతర సంబధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపించిన భార్య